Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య NC 22 మైసూర్ కీలక షెడ్యూల్‌ పూర్తి

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2022 (17:37 IST)
Naga Chaitanya
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో NC22 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇటివలే చిత్ర తారాగణం ప్రకటించారు నిర్మాతలు. అత్యున్నత నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.  
 
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్రబృందం.
 
ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనున్నారు. నాగచైనత్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా NC22 తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్ ఎస్ఆర్ కతీర్ ఈ చిత్రానికి కెమరామెన్ గా పని చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments