ఫిదా భామ సాయిపల్లవి రీల్ లైఫ్‌లోనూ రియల్ లైఫ్‌లోనూ ఒకేలా వుంటుంది. ఎంత డబ్బిచ్చినా ఎక్స్పోజింగ్ చేసేది లేదని మొఖాన్నే చెప్పేస్తుంది. ఆమెకంటూ కొన్ని నియమాలు, పద్ధతులున్నాయి. వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తుంది. పరిమితులు దాటే పరిస్థితి వస్తే సినిమా చేయనంటారు. అది ప్రేయసి పాత్రైనా చెల్లి పాత్రైనా సినిమాలో ప్రాధాన్యత ఉండాలి.
చిరంజీవి లాంటి స్టార్‌కి నిర్ధాక్షిణ్యంగా చేయనని చెప్పేసే అంత ధైర్యం ఆమె సొంతం. అలాగే సాయి పల్లవి స్కిన్ షో చేయదు. అవసరం లేని మేకప్ వేసుకోదు. కెరీర్లో సాయి పల్లవి ఒక్క సినిమాలో కూడా పొట్టి బట్టలు వేసుకుంది లేదు. శృంగార సన్నివేశాల్లో నటించలేదు.
అయితే ఓ హీరోకి ఆమె లిప్ కిస్ పెట్టారు. తన పద్ధతులు, నిబంధనలు ఆ హీరో కోసం పక్కన పెట్టారు. ఆ హీరో ఎవరో కాదు నాగ చైతన్య. లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్యను రెండు సార్లు కిస్ చేస్తుంది. లోకల్ ట్రైన్ లో పబ్లిక్‌గా అతని బుగ్గపై ముద్దు పెడుతుంది. రెండో సన్నివేశంలో పడుకున్న నాగ చైతన్య పెదాలపై ముద్దు పెడుతుంది. నిజంగా ఇది షాకిచ్చే విషయమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
సాయి పల్లవి చాలా మంది హీరోలతో నటించారు కానీ ఎవరితో లిప్ లాక్ సన్నివేశం చేయలేదు. నాగ చైతన్యతో కూడా మరీ ఘాటుగా ఆ సన్నివేశం ఉండదు. అయితే సాయిపల్లవి అది చేయడమే చాలా ఎక్కువ. ఆమె ఈ సీన్ చేయడానికి ఒప్పుకోవడం వెనుక దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా కారణం కావచ్చునని టాక్ వస్తోంది. ఈ సినిమా విడుదలై కొంత కాలం గడుస్తున్నా.. ప్రస్తుతం ఫిదా భామ లిప్ లాక్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది.