Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టడీ కోసం నాగ చైతన్య, కృతి శెట్టి పై సాంగ్ చిత్రీకరణ

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (18:20 IST)
Naga Chaitanya, Kriti Shetty and others
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ' ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. లీడ్ పెయిర్ - నాగ చైతన్య, కృతి శెట్టిపై  ఒక పాటను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఏడు విభిన్నమైన భారీ సెట్లు వేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డివై సత్యనారాయణ కలిసి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు.
 
మాస్ట్రో ఇళయరాజా,  లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ నంబర్‌  బిగ్ స్క్రీన్‌పై విజువల్ ఫీస్ట్ గా వుండబోతుంది.
 
సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. ఇప్పటివరకూ ఓ గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్‌ లని విడుదల చేశారు. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, అద్భుతమైన సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments