Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య కస్టడీ టీజర్ వచ్చేసింది (video)

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (17:19 IST)
Naga Chaitanya, Custody
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ' వేసవిలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.
 
టీజర్‌ టీజ్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్ టీజర్‌తో వచ్చారు. నాగ చైతన్య వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు , ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ’’ అనే వాయిస్ ఓవర్ చాలా ఆసక్తికరంగా వుంది.  
 
 నాగ చైతన్య తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. కృతి శెట్టి అతని గర్ల్‌ఫ్రెండ్‌గా కూల్‌గా కనిపించింది. అరవింద్ స్వామి తన విలనీ యాక్టింగ్‌తో క్యారెక్టర్‌కి ఎక్స్‌ట్రా ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. శరత్‌కుమార్, ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో కన్విన్సింగ్‌గా కనిపించారు.
 
ఎప్పుడూ కొత్తదనం వుండే కథలనే ఎంచుకునే జీనియస్ వెంకట్ ప్రభు మరో యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చారు. కథాంశం గురించి పెద్దగా వెల్లడించకుండా, టీజర్‌ చూపించిన విధానం క్యురియాసిటీని పెంచింది.
 
ఎస్ఆర్ కతీర్ కెమెరా పనితనం  అద్భుతంగా వుంది. మాస్ట్రో ఇళయరాజా,  లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా ద్వయం చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను, కథానాయకుడు అనుభవించే బాధను ఎలివేట్ చేయడానికి సహాయపడింది. అబ్బూరి రవి డైలాగ్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
 
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నఈ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలు , సాంకేతిక ప్రమాణాలు టీజర్‌లో గమనించవచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. ఈ గ్రిప్పింగ్ టీజర్ తప్పకుండా బజ్‌ని మరింతగా పెంచుతోంది.
 
ఈ చిత్రానికి రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments