Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కస్టడీ డబ్బింగ్ ప్రారంభించిన నాగ చైతన్య

Advertiesment
chitu dubbing
, మంగళవారం, 7 మార్చి 2023 (11:07 IST)
chitu dubbing
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
 
తాజాగా కస్టడీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న ఫోటోని షేర్ చేశారు. ‘’నాగ చైతన్య డబ్బింగ్ మొదలుపెట్టారు. త్వరలోనే ఎక్సయిటింగ్ టీజర్ అప్డేట్’’ అని మేకర్స్ తెలియజేశారు.  
 
ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన కస్టడీ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.
 
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోలీని జరుపుకోవడానికి ముంబైకి వచ్చిన హీరో నాని