Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్‌ స్టోరీ షూటింగ్ పూర్తి.. ఓటీటీలో కాదు.. థియేటర్‌లోనే రిలీజ్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (17:30 IST)
Love story
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ''లవ్‌ స్టోరీ'' తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కరోనా కంటే ముందే మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. 
 
ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఎప్పుడెప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని చూపించనున్నాడు శేఖర్ కమ్ముల. ఇక నాగచైతన్య, సాయిపల్లవి ఈ సినిమా తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
 
ఇకపోతే.. లవ్ స్టోరీ సినిమాను ఎలాగైనా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు మరోసారి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు గతంలో కొన్ని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ చిత్ర యూనిట్ మాత్రం అలాంటి ఆలోచనలో లేనట్లు మరోసారి క్లారిటీ ఇచ్చింది. కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాతనే రిలీజ్ డేట్ గురించి ఆలోచించాలని చిత్ర నిర్మాతలు ఒక ప్లాన్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments