Webdunia - Bharat's app for daily news and videos

Install App

''లవ్ స్టోరి'' షూటింగ్ పూర్తి, త్వరలో విడుదలకు సన్నాహాలు

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (17:19 IST)
ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ''లవ్ స్టోరి''. ఈ రియలిస్టిక్ ప్రేమ కథలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ''లవ్ స్టోరి'' సినిమా తాజాగా పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
 
ఈ సందర్భాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల, నాయిక సాయి పల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ సెలబ్రేట్ చేసుకుంటూ ఫొటో తీసుకున్నారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటతో ''లవ్ స్టోరి'' సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. థియేటర్లు తెరుచుకుని, హాల్స్ దగ్గర ఆడియెన్స్ సందడి మొదలు కాగానే ''లవ్ స్టోరి'' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
 
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్; 
సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు; నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు ; రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments