Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని-పవన్‌ కాంట్రవర్సీపై నాగబాబు.. నా నోరు పాడుచేసుకోవాలనుకోలేదు..

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:09 IST)
'మా' ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతోంది. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు మద్దతునిస్తున్న మెగా నటుడు నాగబాబు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొని అసోసియేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా పవన్‌-పోసాని మధ్య జరిగిన వార్‌ ఆఫ్‌ వర్డ్స్‌పై స్పందించారు. అలాగే, ప్రకాశ్‌రాజ్‌కి ఓటు వేయొద్దంటూ సీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'మా' అభివృద్ధికి ప్రకాశ్‌రాజ్‌ వద్ద మంచి ప్రణాళిక ఉంది. ఇప్పటివరకూ 'మా' అధ్యక్షులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ దాని సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. నరేశ్‌ మాత్రమే అసోసియేషన్‌ మసకబారేలా చేశాడు. ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగనివ్వలేదు'' అని నాగబాబు ఆరోపించారు.
 
అనంతరం 'రిపబ్లిక్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ''మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాం. మా అన్నయ్య ఏం చెప్పినా మేము ఫాలో అవుతాం. 'రిపబ్లిక్‌' వేడుకలో పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు అన్నయ్య విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్నినాని అన్నారు. కానీ.. అన్నయ్య ప్రత్యక్షంగా చెప్పలేదుగా?. కొన్ని వ్యక్తిగత ఆరోపణలు మినహాయిస్తే సినీ ఇండస్ట్రీ సంక్షేమం కోసమే పవన్‌ అలా మాట్లాడాడు. 
 
తమ్ముడు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా' అని ఆయన అన్నారు. అనంతరం పోసాని-పవన్‌ కాంట్రవర్సీపై తాను స్పందించలేనని తెలిపారు. 'ఆ వ్యక్తి పేరు పలికి నా నోరు పాడుచేసుకోవాలనుకోవడం లేదు' అని ఆయన స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments