Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది విడదీయలేని అనుబంధం : నాగబాబు భావోద్వేగ ట్వీట్

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (16:00 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ వేదికగా ఒకచోట చేరి, తమ సంతోషాన్ని, ఆనంద క్షణాలను గడిపారు. పెళ్లి వేడుక సందర్భంగా తీసిన ఫోటోల్లో ఓ ఫోటోను మెగా బ్రదర్ నాగబాబు తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి, సోదరుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి తానున్న ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ ఫోటో కింద ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు.
 
"తమ మధ్య భేదాభిప్రాయాలు, వాదనలు ఉన్నప్పటికీ తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఆ అనుబంధం తాము చేసిన పనులకు, వాటి జ్ఞాపకాలకు చెందినది మాత్రమే కాదని, అది ఎంతో లోతైన బంధమని అన్నారు. తమది విడదీయలేని అనుబంధ"మని తెలిపారు. 

పోటీ నుంచి తప్పుకున్న షర్మిల.. కాంగ్రెస్‌కు మద్దతు 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలోని భారాస ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరగపోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులన్నా.. కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఇటీవల ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలను కలిసినపుడు తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని చెప్పారు. 
 
నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించామని, తమ పార్టీ తరపున కొందరు అభ్యర్థులను బరిలోకి దించాలని భావించామన్నారు. అదేసమయంలో తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాననే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆమె జోస్యం చెప్పారు. 
 
అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలరాదన్న నిర్ణయంతో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తాము నిర్ణయించినట్టు చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డుకోకూడదనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు, నాయకులంతా అర్థం చేసుకోవాలని షర్మిల కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

తర్వాతి కథనం
Show comments