Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోకుల్‌ఛాట్ మీద నాగ్ సినిమా అంటే డ్రైగా వుంటుంద‌నుకున్నాః మెగాస్టార్ చిరంజీవి

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:13 IST)
Chiru, nag
నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ ఏప్రిల్‌ 2న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఆఫీసర్, ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా ఇటీవల ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా వీక్షించారు.

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ,  ‘వైల్డ్ డాగ్’ సినిమా గురించి చెప్పాలి అని నా ఆచార్య, అలాగే ఈ ‘వైల్డ్ డాగ్’ నిర్మాత నిరంజన్ రెడ్డి గారిని, నా మిత్రుడు నాగ్‌ని కోరినప్పుడు వెంటనే అరేంజ్ చేశారు. మంచి విషయాలు జరుగుతున్నపుడు పది మందితో పంచుకోవడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమా చూడగానే నాకు అదే అనిపించింది. మనమంతా గర్వపడే గొప్ప సినిమా ఇది. ఈ సినిమా రావడానికి ముందు నా నిర్మాత కొన్ని విషయాలు చెప్పాడు తప్ప నాకు పెద్ద క్యూరియాసిటీ లేదు. గోకుల్ చాట్.. ఒక వాస్తవ కథను తెరకెక్కిస్తున్నారు.. సాంగ్స్ ఉండవు, రొమాంటిక్ సీన్స్ ఉండవు.. నాగ్ సినిమా అంటే ఇవన్నీ ఊహిస్తాం కానీ అవేవీ ఉండవు కాబట్టి డ్రైగా ఉంటుందని అనుకున్నా. కానీ ఈ సినిమా చూసేటప్పుడు ఆద్యంతం ఉత్కంఠగా అనిపించింది. చివరకు ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశానంటే ఈ సినిమా మీద నా ఇంట్రెస్ట్ చివరిదాకా ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎగ్జ‌యిట్ మెంట్ ఆపుకోలేక వెంటనే నాగ్ కి ఫోన్ చేసి ఈ సినిమాను ఎందుకు లో ప్రొఫైల్ లో ఉంచారు. ఎందుకు తక్కువ మాట్లాడారని అడిగా. సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఈ సినిమా చూశానని చెప్పడం అతిశయోక్తి కాదు..వాస్త‌వం. ఈ సినిమా గురించి నిజం చెప్పాలంటే మాటల్లేవు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ చెప్పారు. చాలా ఆదరించారు. వాళ్లందరికీ చిత్రయూనిట్ తో పాటు నేను కూడా థాంక్స్ చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించా. 
 
వాస్తవ ఘటనలకు దగ్గరగా ఈ సినిమాను చాలా సహజంగా తీశారు. మనకు తెలిసి సర్జికల్ స్ట్రైక్ మీద తీసిన ‘యూరి’ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఆ సినిమా చూసి మనం ఎందుకు ఇలాంటి సినిమా తీయలేకపోతున్నాము. మనం ఈ కమర్షియల్ ట్రాక్ లో పడిపోయి ఉన్నామా అనుకుంటున్న సమయంలో ప్రయోగాత్మక సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమా చేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఎస్, తెలుగు వాళ్లుగా ఇలాంటి సినిమాలు కూడా అత్య‌ద్భుతంగా తీయగలం అని నిరూపించిన సినిమా ఈ వైల్డ్ డాగ్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న వార్ సీన్స్, గన్ ఫైట్స్ బాగా నచ్చాయి. వాటితో పాటు ఒక భార‌తీయుడుగా ఎమోష‌న‌ల్‌గా, గ‌ర్వంగా ఫీల‌య్యా..ఈ సినిమాకు మూల పురుషుడు సాల్మన్. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అని పెట్టుకున్న ఆయన నమ్మకాన్ని, మా నిర్మాత నిరంజన్‌రెడ్డిగారిని నేను అభినందిస్తున్నా. చాలా ఫెంటాస్టిక్ జాబ్. ఇంత తక్కువ రోజుల్లో ఈ బడ్జెట్ లో సినిమా తీయడం గ్రేట్. నాగ్ అనేసరికి రొమాంటిక్ సీన్స్, ఫైట్స్ ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారని అనుకున్నా కానీ నేటితరం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు కూడా ఆదరిస్తారని అర్థమైంది. ఇలాంటి మార్పు కోరుకుంటున్న ప్రేక్షకులకు నిజంగా సెల్యూట్ చేయాలి. ఇంకా ఎవ‌రైనా చూడ‌కుంటే ఖ‌చ్చితంగా వెళ్లి చూడాల్సిన సినిమా. ఇది నా సొంత సినిమా..నేను యాక్ట్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఆనందాన్నినేను అనుభ‌విస్తూ.. మీతో ప్రత్యక్షంగా షేర్ చేసుకోవాలనే ఈ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి కొత్త కథలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.
 
రాత్రి 9గంట‌ల‌కు చిరుకాల్‌చేశారు
నాగార్జున మాట్లాడుతూ.. ‘ఆల్రెడీ ఈ సినిమా గురించి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి చాలా ప్రశంసలు వచ్చాయి. కానీ నిన్న రాత్రి 9 గంటలకు చిరంజీవి కాల్ చేశారు. హ్యాపియెస్ట్‌గా అనిపించింది. అస‌లు ఆయ‌న సినిమా చూస్తున్నాడు అని కూడా నాకు తెలీదు. ఆయ‌న ఫోన్ చేయ‌గానే ఏంటి స‌ర్ ఈ టైమ్ లో ఫోన్ చేశారు అని అడిగాను వెంట‌నే ఎగ్జ‌యిట్‌మెంట్‌తో సినిమా ఫెంటాస్టిక్‌గా ఉంది నాగ్ భ‌లే చేశావు అని అన్నారు. ప్రతి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అంటుంటే చాలా ప్ర‌త్యేకంగా అనిపించింది. ‌ఈ సినిమా చేసినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇంటర్వెల్ కూడా లేకుండా కంటిన్యూ చేసి సినిమా చూశాను అని చిరంజీవి గారు అన్నారు థాంక్యూ సో మచ్. ఆయ‌నే ప్రెస్ మీట్ పెట్టండి నేను ఈ సినిమాగురించి నేను మాట్లాడాలి అనడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments