Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయనా నాగార్జునా.. ఈ పోస్టర్ ఏంటయ్యా..?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (11:06 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ మూవీ కాకుండా డిఫరెంట్ మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ఈసారి యాక్షన్ మూవీని ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నాడు.
 
ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ డిఫరెంట్‌గా ఉండటంతో క్యూరియాసిటీ ఏర్పడింది. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా కుదరలేదు. ప్రస్తుతం మనాలీలో షూటింగ్ జరుగుతుంది. మరో 10 రోజులు అక్కడే షూటింగ్. ఇదిలా ఉండగా.. మనాలీ షూటింగ్ సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు. ఈ వర్కింగ్ స్టిల్స్‌లో వైల్డ్ డాగ్‌గా ఎన్ఐఏ ఏజెంట్‌గా నాగ్ అదరగొట్టాడు. ఆ గెటప్ నాగ్‌కు పెర్ఫెక్ట్‌గా సూట్ అయిందనే టాక్ వచ్చింది.
 
ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతా బాగానే ఉంది అనుకుంటుంటే... ఈ స్టిల్స్‌ను ఇలా రిలీజ్ చేయడమే అక్కినేని అభిమానులకు నచ్చలేదు. కారణం ఏంటంటే... గతంలో రిలీజ్ చేసిన స్టిల్స్‌లో ఓ స్టిల్లో క్లోజ్‌లో మాత్రమే చూపించారు. మరో స్టిల్లో పేపర్ క్లిప్పింగ్‌లో భాగంగా మాత్రమే నాగ్‌ను చూపించారు.
 
ఇలా మెషీన్ గన్ పట్టుకొని, ఫుల్ కటౌట్ పిక్చర్‌ను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇలా రిలీజ్ చేసినప్పుడు సోలో స్టిల్ రిలీజ్ చేయకుండా ఇలా గుంపులో గోవింద అన్నట్టుగా ఉన్న స్టిల్ రిలీజ్ చేయడం ఏంటి అంటున్నారు. అవును కరెక్టే కదా.. మరి వారి ఆలోచన ఏంటో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments