Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చింపాంజీ.. కన్నీళ్లు పెట్టుకున్న అరియానా.. కెప్టెన్‌గా..?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (09:59 IST)
Ariyana
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సక్సెస్ ఫుల్‌గా 55 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శుక్రవారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది. అరియానా కోరిక మేరకు ఆమె కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన బిగ్ బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ వ్యక్తి వచ్చాడు. స్టోర్ రూంలో ఉన్న అతనిని ఇంటి సభ్యులకు పరిచయం చేయండని అన్నారు. దీంతో స్టోర్‌రూంలోకి వెళ్ళిన అరియానా.. చింపాంజీ బొమ్మని చూసి ఎమోషనల్ అయింది. 
 
వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా వచ్చింది ఈ బొమ్మే అని తెలుసుకుంది. బయటకు వెళ్ళి ఇంటి సభ్యులకు ఇదే విషయాన్ని చెప్పగా, మొదట వారు నమ్మలేదు. తర్వాత అరియానా.. బొమ్మను చూస్తూ కన్నీరు పెట్టుకుంది. అవినాష్ ఓదార్చాడు. ఇక కొద్ది సేపటి తర్వాత సోహైల్‌, మెహబూబ్ గేమ్‌లో ఎలా ముందుకు పోవాలనే విషయంపై ముచ్చటించారు.
 
అభిజిత్‌, మోనాల్‌లు తప్పొప్పుల గురించి చర్చించుకున్నారు. అఖిల్ కూడా ఈ డిస్కషన్‌లో జాయిన్ అయ్యాడు. మేటర్‌ని ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, అది సాధ్యం కాలేదు. నువ్ ఐ లైక్ యూ చెప్పావ్.. ఆ తరువాత నన్ను మ్యానిప్యులేటర్ అన్నావ్.. నాగార్జున ముందు ఇద్దరిదీ తప్పు అని చెప్పావ్ అంటూ పాత గొడవల గురించి ప్రస్తావించాడు అభిజిత్‌.
 
అభిజిత్‌, మోనాల్ డిస్కషన్ మధ్య దూరి అఖిల్..నువ్వు ఆ సమయంలో చెప్పిన టోన్ హై పిచ్‌లో ఉంది. ఇలా చెప్తే ఆమె అర్ధం చేసుకునేదేమో అని అన్నాడు. మోనాల్‌కి అలా అర్థమైతే నేను ఆమెకు క్షమాపణ చెప్పాలని లేదు.. నా గురించి నేను మాట్లాడుకోవడానికి నాకు హక్కు ఉంది. ఆమె హర్ట్ అయ్యిందంటే నేను హర్ట్ చేయలేదు. కానీ మోనాల్ వల్ల నేను హర్ట్ అయ్యా.. నేను నీ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.. ఇద్దరం ప్రశాతంగా ఉందాం అంటూ కాసేపు హాట్ హాట్ డిస్కషన్ జరిగింది. ఇదిలా ఉంటే.. అరియానా బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్ అయ్యే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments