Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ అశ్విన్- ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఆమేనా?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (22:34 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ 21వ చిత్రంపై దృష్టి పెట్టనున్నాడు. రాధే శ్యామ్ షూటింగ్‌లో వుండగానే ఈ చిత్రంపై 21వ సినిమాలో నటిస్తాడని తెలుస్తోంది. 
 
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారబోతున్నాడు.
 
దేశ విదేశాల్లో ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ముందుగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే అని.. ఆ తర్వాత కత్రినా కైఫ్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్టుగా మరో బాలీవుడ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది.
 
ఇప్పుడు వాళ్ళను కాదని మహేశ్‌బాబు 'భరత్‌ అనే నేను'లో నటించిన కైరా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారట. 'అర్జున్‌ రెడ్డి' హిందీ రీమేక్‌ 'కబీర్‌ సింగ్‌'లో కైరా అద్వానీ యాక్టింగ్‌ నచ్చి ఆమెను ఎంపిక చేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments