Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ స్వయంభూ లో సుందర వల్లిగా నభా నటేష్

డీవీ
గురువారం, 12 డిశెంబరు 2024 (09:44 IST)
Nabha Natesh
నిఖిల్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. ట్యాలెంటెడ్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లెజండరీ వారియర్ గా కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
హై బడ్జెట్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ కాన్వాస్‌పై పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్‌లు గా నటిస్తున్నారు.
 
తాజాగా నభా నటేష్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె క్యారెక్టర్ ని సుందర వల్లిగా పరిచయం చేస్తూ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నభా నటేష్ న్యూ పోస్టర్‌ లో రాయల్ ట్రెడిషనల్ లుక్ లో బ్యూటీఫుల్ గా కనిపించారు. సుందర వల్లి పాత్రలో సాఫ్ట్ అండ్ ఛార్మింగ్ స్మైల్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments