Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'' ట్రైలర్‌ మీ కోసం..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'' ట్రైలర్‌ వచ్చేసింది. బన్నీ, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం నాడు ట్విట్టర్ ద్వ

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (13:34 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'' ట్రైలర్‌ వచ్చేసింది. బన్నీ, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం నాడు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు బన్నీ. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ చిత్రం మే 4న ఈ సినిమా రిలీజ్ కానుంది.  ఇటీవల ఈ చిత్ర ప్రీరిలీజ్‌ను గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం అనే గ్రామంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ''నాకు ఇండియా కావాలి ఇచ్చెయ్'' అంటూ అల్లు అర్జున్ డైలాగ్‌తో ట్రైలర్ అవుట్ అయ్యింది. 
 
జైలుగదిలో తీవ్రవాదితో ఇదే నీ ఆఖరి బిర్యానీ. బిర్యానీ తినేంతలోపు నిన్ను చంపేస్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, నాకు కోపం వచ్చినప్పడు బూతులే వస్తాయి.. మంత్రాలు రావు. క్యారెక్టర్ వదిలేయడం అంటే ప్రాణాలు వదిలేయడమే. చావు రాకముందు చచ్చిపోవడమే అని టీజర్‌లో బన్నీ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. 
 
ఇక ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే, ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు రంగస్థలం చిట్టిబాబు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments