మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమా టైటిల్ 8 వసంతాలు

డీవీ
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (16:12 IST)
8 Vasantalu poster
మైత్రీ మూవీ మేకర్స్ హై బడ్జెట్‌లో స్టార్ హీరోల సినిమాలను నిర్మించడంతో పాటు,  ఆసక్తికరమైన వినూత్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలనీ రూపొందిస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టితో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అవార్డ్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ షార్ట్ ఫిల్మ్ మధురం తీసి, విమర్శకుల ప్రశంసలు అందుకుని, 'మను' సినిమాతో తన ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఫణీంద్ర నర్సెట్టి '8 వసంతాలు' అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో రాబోతున్నాడు.
 
8 వసంతాలు అంటే '8 స్ప్రింగ్స్', ఈ న్యూ ఏజ్ రోమాన్స్ డ్రామా, ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.  
 
టైటిల్, టైటిల్ పోస్టర్‌తో దర్శకుడు తన వినూత్న కోణాన్ని చూపించాడు. “365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదే అనుభవాలతో కొలిస్తే, ఒక వసంతం” అని పోస్టర్‌లో ఉంది. టైటిల్ పోస్టర్‌లో వర్షంలో తడుస్తున్న గులాబీ కనిపిస్తుంది.
 
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, పోస్టర్ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను తర్వాత వెల్లడించనున్నారు మేకర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూత

Chandra babu: త్వరలో సంజీవని ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ సర్కారు

Amaravati: అమరావతి తొమ్మిది లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం.. తుది దశలో పనులు

Air India: విమానం రెక్కల్ని ఢీకొన్న పక్షి- 103మంది ప్రయాణీకులను కాపాడిన పైలట్

Jayalalitha: జయలలిత నెచ్చెలి శశికళ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments