Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు యేడాది జైలుశిక్ష

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (14:40 IST)
టాలీవుడ్ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఏపీలోని ఒంగోలు కోర్టు ఒక యేడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జానకీరామయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు శిక్ష విధించింది. పైగా, పిటిషన్‌కు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలని ఆదేశించింది.
 
గత 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తివద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షల అప్పు తీసుకున్నాడు. జానకీరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేశ్‌ రూ.95కు చెక్ ఇచ్చాడు. ఈ చెక్ బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీంతో జానకీరామయ్య ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. 
 
జానకీరామయ్య వద్ద తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులను కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. పైగా, చెక్ బౌన్స్ కావడంతో యేడాది జైలు శిక్ష విధించింది. గతంలో ఎర్రమంజల్ కోర్టు కూడా బండ్ల గణేశ్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ దాఖలు చేసిన ఈకేసులో జైలుశిక్షతో పాటు రూ.15,86,550 జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments