Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

దేవీ
సోమవారం, 23 జూన్ 2025 (18:06 IST)
Anantika Sunilkumar, Hanu Reddy, Ravi
మైత్రి మూవీ మేకర్స్  '8 వసంతాలు' హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
 
హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ మాట్లాడుతూ, థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు చాలా గ్రేట్ ఫుల్ గా అనిపించింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా రిహార్సల్ చేశాం. ఈ పాత్ర నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది. సినిమాకి అందరూ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు
 
యాక్టర్ హను రెడ్డి మాట్లాడుతూ, సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  ఇది ఎప్పటికీ గర్వపడే సినిమా. ఇలాంటి సినిమాతో డెబ్యు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను'అన్నారు.
 
యాక్టర్ రవి మాట్లాడుతూ, ప్రీమియర్స్ నుంచి ఇప్పటిదాకా 6 షోస్ చూశాను. ఆడియన్స్ నుంచి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. మా డైరెక్టర్ ఈ సినిమాకి ప్రేక్షకుడిలా వెళ్లి ప్రేమికుల బయటకి వస్తారని చెప్పారు. అది ఈ రోజు జరిగింది. చాలా స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసామని అడియన్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది.  ఇలాంటి బ్యూటిఫుల్ సినిమాని అందించినందుకు ఒక ప్రేక్షకుడిగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డైరెక్టర్ ఫణి గారికి థాంక్యూ. చాలా అద్భుతమైన సినిమా ఇచ్చారు. ఈ సినిమా జర్నీ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమా చాలా ఏళ్లు పాటు గుర్తుండిపోతుంది. ఒక స్త్రీ పాత్రను ఎంత అద్భుతంగా చూపించవచ్చో చెప్పడానికి ఈ సినిమా ఒక రిఫరెన్స్ గా నిలుస్తుంది.'అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

చెన్నై మహానగరంలో పెరిగిపోతున్న అంతు చిక్కని జ్వరాలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments