Naveen Yerneni, Y. Ravi Shankar, Phanindra Narsetti, Ananthika Sunilkumar
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ, చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు... మంచి సినిమానా కాదా అనేది చూస్తారు. ఒక మంచి సినిమా వస్తే చేస్తారనే దానికి నేనే నిదర్శనం. మనిషిని మనిషిగా చూడటం చాలా కష్టం. మైత్రి మూవీ మేకర్స్ మనిషిని మనిషి లాగా చూస్తారు. అందుకే ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా వున్నారు. అనంతిక ఈ సినిమా చేయడానికి డబ్బు కూడా అక్కర్లేదని చెప్పింది. టాలెంట్ కంటే ఇలాంటి పాషన్ ఉండడం చాలా గొప్ప విషయం.
ఒక 17 ఏళ్ల అమ్మాయికి డబ్బు సంపాదించుకోవడం తెలుసు, వద్దు అనుకోవడం తెలుసు. ఇది చాలా గొప్ప విషయం. తను చాలా గొప్ప పెర్ఫార్మర్ అవుతుంది. శుద్ధి అయోధ్య పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఓపెన్ సీక్వెన్స్ మిస్ అవ్వొద్దు. సినిమా అంతా రివర్స్ లో వెళ్తుంది. అందుకే ఓపెనింగ్ సీక్వెన్స్ ఎవరు మిస్ అవ్వద్దు అని కోరుతున్నాను. చాలా మంది కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా అంటున్నారు. పెన్ ఓ పదినిమిషాలు పక్కన పెట్టి ఈ ప్రేమ, మనసుకు సంబంధించిన విషయాలు ఎందుకని ఆలోచిస్తే ఎలా ఉంటుందో వారణాసి లో ఫైట్ చూస్తారు. ఇంత బలంగా చెప్పడానికి కారణం ఆలోచన, టీం వర్క్. కమర్షియల్ సినిమా తీయలేక కాదు తీయాలని లేక. నాకు ఆడియన్స్ పై ఎప్పుడూ నమ్మకం వుంది అన్నారు
హీరోయిన్ అనంతిక మాట్లాడుతూ, ఇప్పటివరకు నాలుగైదు సినిమాలు చేశాను. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా జీవితంలో ఎప్పుడూ లేదు. ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంది. శుద్ధి లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తానని అని ఎప్పుడూ అనుకోలేదు. ఫణి గారి వల్లే సాధ్యమైయింది. యాక్షన్ ఎమోషన్ లవ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇలాంటి రోల్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అయోధ్య పాత్రకు చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను. ఆడియన్స్ కూడా అలా డీప్ గా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. చాలా స్పెషల్ మూవీ ఇది. మైత్రి లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఈ క్యారెక్టర్ లో నన్ను బిలీవ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కి థాంక్యూ అన్నారు.