Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త అపరిచితుడు, సెల్వమణి గురించి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (14:51 IST)
రోజా. సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా మంచి పేరున్న వ్యక్తి. ఈ మధ్య బుల్లితెరపై కూడా బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో తన గురించి ఆసక్తికరమైన విషయాలను రోజా చెప్పారు. దీంతో కంటెస్టెంట్లంతా ఆసక్తికరంగా చూశారట.

ఇంతకీ రోజా ఏం చెప్పారంటే... ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ప్రేమ కథ. అందరూ తమ ప్రేమ కథలను తలుచుకుని నవ్వుకుంటూ ఉంటారు. నేను కూడా నా ప్రేమకథను తలుచుకుంటే నవ్వు వస్తుంటుంది. ముఖ్యంగా నా భర్త నన్ను ప్రేమించిన విషయాన్ని నాకు చెప్పలేదు. అదే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం.
 
ఎందుకంటే తాను ప్రేమించిన విషయాన్ని మా ఇంట్లో నా తల్లిదండ్రులకు చెప్పాడు నా భర్త సెల్వమణి. అపరిచితుడు సినిమాలో విక్రమ్ ఏవిధంగా అయితే నటిస్తారో.. అలానే నా భర్త ఉంటారు. చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. 
 
నిన్ను ప్రేమిస్తున్నానని షూటింగ్‌లో నా భర్త నా దగ్గర వచ్చి చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్లు కూడా మన పెళ్లికి ఒప్పుకున్నారు. మనం పెళ్ళి చేసుకుందాం అన్నాడు. అప్పటికే నేను ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేసి ఉన్నాను.
 
సెల్వమణిపై నాకు మంచి అభిప్రాయమే అప్పట్లో ఉండేది. అందుకే ఆయన ప్రపోజ్ చేయగానే ఒకే అనేశానని రోజా చెప్పారు. మా పెళ్ళి 2002లో జరిగింది. ఒక కూతురు, ఒక కుమారుడు. మీకు మిగతాది తెలుసు కదా అంటూ రోజా నవ్వుతూ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments