అతనో న్యాయవాది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డాడు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు మహిళలతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. తిరుపతిలో ఒక ప్రియురాలితో ఏకంగా కాపురమే పెట్టేశాడు. ఇక భార్య ఊరుకుంటుందా.. పోలీసులను వెంటపెట్టుకుని భర్తను రెడ్ హ్యాండెండ్‌గా పట్టించాలనుకుంది. అయితే భార్య వచ్చిన విషయాన్ని తెలుసుకుని రెండు అంతస్తుల మిద్దెపై నుంచి దూకాడు భర్త.. ఆ తరువాత ఏమైదంటే?
చిత్తూరుకు చెందిన చంద్రమౌళి, కవితలకు గత కొన్నిసంవత్సరాల క్రితం వివాహమైంది. న్యాయవాది వృత్తిలో ఉండే చంద్రమౌళికి పెళ్ళికాక ముందు కొంత మంది మహిళలతో శారీరక సంబంధం ఉండేదని భార్య కవిత చెబుతోంది. వివాహమైన కూడా భర్తలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె చెబుతోంది.
అయితే ఇంట్లో ఎప్పుడూ ఉండకుండా బయట తిరిగే చంద్రమౌళిని చాలాసార్లు ప్రశ్నించానని, అయినా ఆయనలో మార్పు రాలేదని.. రెడ్ హ్యాండెండ్‌గా తన బాగోతాన్ని బయటపెట్టేందుకే పోలీసులను తీసుకొచ్చానని చెబుతోంది భార్య కవిత. తిరుపతిలోని పద్మావతి నగర్‌లో భార్య ప్రియురాలితో కలిసి ఉన్నప్పుడు నేరుగా ఇంట్లోకి వెళ్ళింది.
భార్య గొంతు విన్న చంద్రమౌళి ప్రియురాలి చీరను కట్టుకున్నాడు. ఆ తరువాత రెండస్తుల మేడపై నుంచి కిందకు దూకేశాడు. కాళ్ళను దెబ్బ తగిలినా పట్టించుకోకుండా పరారయ్యాడు. భర్తను పట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది కవిత. అయితే మహిళా పోలీసులు ఆలస్యంగా రావడంతో ఆమె మౌనదీక్షకు దిగింది. న్యాయం కావాలంటూ మౌనదీక్ష చేపట్టింది కవిత.