నాన్నే నాకు భ‌గ‌వంతుడుః చ‌ర‌ణ్‌

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (16:53 IST)
charan- saikumar
ఎస్‌.పి.బాలు 75వ జ‌యంతి సంద‌ర్బంగా శుక్ర‌వారం నాడు తెలుగు సినీరంగానికి చెందిన ప్ర‌ముఖులు ప‌లువురు ఆన్‌లైన్ మీటింగ్‌లో క‌లిశారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఆయ‌న తాను చేసిన అభిలాష సినిమాలోని యురేకా.. పాట గురించి బాలుగారు క‌ష్ట‌ప‌డిన పాడిన విధానంతోపాటు ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు.
 
అనంత‌రం సాయికుమార్ లైన్‌లోకి వ‌చ్చారు. ఆయ‌న మాట్లాడుతూ, పాట‌లో ప‌ల్ల‌వి, చ‌ర‌ణాలు ఎంత ఇంపార్టెంటో చ‌ర‌ణ్ అన్నా ఆయ‌న‌కు అంత ఇది. బాలుకు చ‌ర‌ణ్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా అంత ఎత్తుకు ఎద‌గాల‌ని ముక్కోటి దేవ‌త‌ల‌ను కోరుకుంటున్నాను అటూ పేర్కొన్నారు. అనంత‌రం  చ‌ర‌ణ్ నుద్దేశించి నీకు నాన్న‌గారు నీకు నేర్పిన తొలి పాట అనుభ‌వం గురించి మాట్లాడ‌మ‌న్నారు.
 
చ‌ర‌ణ్ స్పందిస్తూ.. ఇలా పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డం ఆనందంగా వుంది. నాన్న‌గారు బ‌తికివుంటే వేరే సంద‌ర్భంగా మీ అంద‌రినీ క‌లిసేవారు. అది  ఓ పండుగ‌లా వుండేది. మీ అంద‌రినీ జూమ్ మీటింగ్‌లో క‌లిసినందుకు, మీరు స‌మ‌యాన్ని కేటాయించినందుకు ఆనందంగా వుంది. నాకు సినీమా వాళ్ళు పెద్ద‌గా ప‌రిచ‌యంలేదు. చిరంజీవిగారు నాన్న‌గారికి ఆత్మీయులు.

ఈరోజు మ‌ధ్యాహ్నం తోట ద‌గ్గ‌ర‌కు వెళ్ళి నాన్న‌గారితో కాసేపు గ‌డుపుదాం అనుకుంటున్నాం. పైలోకంలో వున్న నాన్న ఆశీస్సులుంటాయి. అంటూ నాకు భ‌గ‌వంతుడు నాన్న‌గారే అని పేర్కొన్నారు. ఇక తొలి పాట గురించి చెబుతూ.. నాన్న‌గారు నాతో గ‌డిపే స‌మ‌యం వుండేదికాదు. ఆయ‌న పాడ‌గా విని నేను పాట‌ను నేర్చుకున్నా అన్నారు. స‌ముద్రంలోంచి ఓ బొట్టును ఎలా వేరు చేయ‌లేమో నాన్న‌గారి పాట‌ల్లో మంచివి ఏమిటంటే ఏమి చెప్ప‌లేన‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు.. కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments