Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబద్దాలతో ప్రధాని మోడీ సరికొత్త రికార్డు : ప్రకాష్ రాజ్ ధ్వజం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల యుద్ధం చేస్తున్నారు.

Webdunia
బుధవారం, 9 మే 2018 (08:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల యుద్ధం చేస్తున్నారు. మొన్నటికి మొన్న.. ఘాటైన పదజాలంతో విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్.. ఇపుడు ప్రధాని అబద్దాలతో సరికొత్త రికార్డు సృష్టించారంటూ ధ్వజమెత్తారు. ఆయన తాజాగా మాట్లాడుతూ..
 
'గతంలో ఏ ప్రధానమంత్రీ చెప్పనన్ని అబద్ధాలతో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయనకు మహా అబద్ధాలకోరు (సుళ్లేంద్ర) బిరుదు ఇస్తున్నా. అధికారం కోసం అన్ని రకాలుగా దిగజారిన ప్రధానిని దేశం నేడు చూస్తోంది. గాలి బ్రదర్స్‌ చేసిన తప్పులను క్షమించానని చెప్పడానికి బీఎస్.యడ్యూరప్ప ఎవరు? 15 సీట్ల కోసం వారిని క్షమించేస్తారా? ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రశ్నించే వారిని, ఎదురు తిరిగే వారిని పాతాళానికి తొక్కేయడం మోడీకి వెన్నతోపెట్టిన విద్య అని ఘాటుగా విమర్శలు చేశారు. అందుకే తన కుటుంబం కూడా తన ప్రాణాలపై ఆందోళన చెందుతోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments