Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీ హిట్లర్ కంటే చాలా డేంజర్.. ఆయనంటే చచ్చేంత భయం : నటుడు ఆమిర్ ఖాన్

తన తండ్రిపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా డాడీ హిట్లర్‌ కంటే చాలా డేంజర్‌ అని వ్యాఖ్యానించాడు. ఆమిర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'దంగల్‌'. ఇందులో ఆమిర్‌.. హర్యానాకి చెంది

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (12:45 IST)
తన తండ్రిపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా డాడీ హిట్లర్‌ కంటే చాలా డేంజర్‌ అని వ్యాఖ్యానించాడు. ఆమిర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'దంగల్‌'. ఇందులో ఆమిర్‌.. హర్యానాకి చెంది రెజ్లర్‌ మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ పాత్రలో నటిస్తున్నాడు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో ఆమిర్‌ తన కుమార్తెలను ఉదయాన్నే లేపి జాగింగ్‌, వ్యాయామం చేయించడం, నదిలో ఈతకొట్టించడం లాంటివి చేస్తుంటాడు. ఇవన్నీ చేయలేక పిల్లలు చాలా అవస్థ పడతారు. ఈ నేపథ్యంలో హానికారక్‌ బాపు పాటను చిత్రీకరించారు. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ అభిమాని 'నిజజీవితంలోనూ మీ పిల్లలతో ఇంతే కఠినంగా ఉంటారా' అని అడిగాడు. ఇందుకు ఆమిర్‌.. 'నేను అలా ఉండను కానీ మా నాన్న హిట్లర్‌ కంటే చాలా డేంజర్‌. మాకు ఆయనంటే చచ్చేంత భయం' అని సమాధానమిచ్చాడు.
 
సినిమాలో ఆమిర్‌ తన కల నెరవేర్చుకోవడానికి పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. మరి నిజజీవితంలో పిల్లలతో ఎలా వ్యవహరించాలని అడగ్గా.. 'ఈకాలంలో పిల్లలు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకుంటున్నారు. మనం పిల్లల్ని సపోర్ట్‌ చేయాలంతే. కానీ వారు ఏ రంగాన్ని ఎంచుకోవాలనుకున్నా అందులోని లాభనష్టాల గురించి వివరించాలి. సినిమాలో మా పిల్లలు చాలా స్ట్రాంగ్‌. మల్లయుద్ధం చేయగలమన్న పట్టుదల ఉంది. కాబట్టి వారిచేత క్లిష్టమైన వర్కవుట్స్‌ చేయిస్తుంటాను. అందుకే నన్ను హానికారక్‌ బాపు అని తిట్టుకుంటుంటారు' అని ఆమిర్ చెప్పుకొచ్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments