Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతికి రిలీజ్.. డిసెంబర్ 16న పాటలు.. సీనియర్ ఎన్టీఆర్ కోరింది..

నందమూరి హీరో బాలయ్య ప్రధాన పాత్రధారిగా నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించనున

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (12:30 IST)
నందమూరి హీరో బాలయ్య ప్రధాన పాత్రధారిగా నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు దర్శకుడు క్రిష్ తెలిపారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్ర యూనిట్ మహా రుద్రాభిషేకం నిర్వహించారు. 
 
అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామని, సంక్రాంతి పండుగ రోజున చిత్రాన్ని రిలీజ్ చేస్తామని క్రిష్ స్పష్టం చేశారు. ఒక గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తానే నమ్మకం తనకు ఉందని, సర్వదేవతలు, ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని దర్శకుడు క్రిష్ అన్నారు.
 
ఇంకా క్రిష్ మాట్లాడుతూ.. దాదాపు అన్ని పౌరాణిక చిత్రాల్లో నటించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరారామావుకు గౌతమీ పుత్ర శాతకర్ణి పాత్రలో నటించాలనేది తీరని కోరికగానే మిగిలిపోయిందని, ఆ కోరికను ఆయన కుమారుడు, నందమూరి బాలకృష్ణ నెరవేర్చారని దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ పాత్రను బాలకృష్ణ తప్పా, మరొకరు చేయలేరని, ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఈ చిత్రం షూటింగ్ కేవలం 79 రోజుల్లోనే పూర్తి చేశామని, ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నట్లు క్రిష్ పేర్కొన్నారు.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments