Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ అంత ప్లజంట్‌గా వుంటుంది నా పాత్ర - కృతిశెట్టి

Webdunia
సోమవారం, 18 జులై 2022 (08:43 IST)
Kriti Shetty,
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.  రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.
 
ఈ చిత్రం నుండి కృతి శెట్టిని స్వాతిగా పరిచయం చేస్తూ ఆమె  ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ట్రెండీ అవుట్ ఫిట్ తో స్టైలిష్‌గా కనిపించింది కృతి. ఆమె కూల్ గా కాఫీ ఆస్వాదించడం ప్లజంట్ గా వుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. నా పాత్ర కాఫీ అంత ప్ల‌జెంట్‌గా వుంటుంద‌ని చెబుతోంది. 
ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా మరో కథానాయికగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ 'రారా రెడ్డి'లో సందడి చేస్తోంది. ఇటివలే  విడుదలైన  లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments