Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉస్తాద్ రామ్ వారియ‌ర్ ఎలా వుందంటే- రివ్యూ రిపోర్ట్‌

Warrior- Ram
, గురువారం, 14 జులై 2022 (14:23 IST)
Warrior- Ram
నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా, విజ‌య్‌కుమార్,
 అజ‌య్‌ త‌దిత‌రులు
 
సాంకేతిక‌త‌- సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, దర్శకత్వం : ఎన్.లింగుసామి
విడుద‌ల- 14-072022
 
ది వారియర్ అనే టైటిల్‌తో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతిశెట్టి న‌టించిన సినిమా గురువార‌మే విడుద‌లైంది. తెలుగు, త‌మిళంలోకూడా విడుద‌లైన ఈ సినిమాను లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాస్ యాక్ష‌న్ చిత్రంగా ట్రైల‌ర్‌లోనే చెప్పేసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
తండ్రి కోరిక‌మేర‌కు స‌త్య (రామ్‌)ను త‌ల్లి (న‌దియా) డాక్ట‌ర్ చ‌దివిస్తుంది. హైద‌రాబాద్ నుంచి డాక్ట‌ర్ హోదాలో క‌ర్నూలు వ‌స్తాడు స‌త్య‌. వ‌చ్చీరాగానే గూండాల చేతిలో చావుబ‌తుకుల‌మ‌ధ్య వున్న ఓ వ్య‌క్తిని డాక్ట‌ర్‌గా కాపాడ‌తాడు. కానీ వృత్తిధ‌ర్మంతో తృప్టిగా వున్న స‌త్య ఆలోచ‌న‌ను భంగంచేస్తూ ఆ వ్య‌క్తిని ఆ ఊరిలో గూండా నాయ‌కుడు గురు (ఆది పినిశెట్టి) మ‌నుషులు ప్రాణం తీసేస్తారు. దాంతో ఆవేశంతో పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తే బెదిరింపుల‌తో కేసు వాప‌సు తీసుకునేలా చేస్తుంది గురు గ్యాంగ్‌. మ‌రోసారి పిల్ల‌ల ప్రాణాల‌ను డ్ర‌గ్ మాఫియా ముసుగులో తీస్తున్న గురు గ్యాంగ్‌కు బుద్ధిచెప్పేందుకు ఊరునుంచి వెళ్ళిపోయి తిరిగి అదే వూరికి ఐ.పి.ఎస్‌. చ‌దివి డి.జి.పి.గా విధుల్లోకి వ‌స్తాడు స‌త్య‌. ఆ త‌ర్వాత స‌త్య ఏం చేశాడు?  గురు గ్యాంగ్ పీచ‌మ‌ణిచాడా? లేదా? ఈ క్ర‌మంలో కృతిశెట్టి పాత్ర ఏమిటి? అనేది తెర‌పై చూడాల్సిందే.
 
విశ్లేష‌ణః
ఇది ఫ‌క్తు మాస్ చిత్రం. అటువంటి సినిమాకు కావాల్సిన అంశాల‌తోనే సినిమా వుంటుంది. గ‌తంలో ఇటువంటి ఛాయ‌లున్న‌ట్లు అనిపించినా, డాక్ట‌ర్ క‌మ్ పోలీస్ ఎలా స‌మాజాన్ని బాగు చేశాడ‌నే పాయింట్ ఇందులో విశేషం. ఈ రెండు పాత్ర‌లూ రామ్ పోషించాడు. పాత్ర‌లో రెండు కోణాలుంటాయి. రామ్ ఎన‌ర్జీ సినిమాకు బ‌లం. అదే బ‌లం ప్ర‌తినాయ‌కుడు ఆది పినిశెట్టిది. ఇద్ద‌రూ నువ్వా? నేనా? అన్న‌ట్లు స‌వాల్ ప్ర‌తిస‌వాల్‌గా సినిమా సాగుతుంది.
 
- సినిమా ఆరంభంలోనే డైరెక్ట్‌గా ద‌ర్శ‌కుడు క‌థ ఇలావుంటుంద‌నే చెప్పే స‌న్నివేశాలు చూపించాడు. రేడియో జాకీగా కృతి శెట్టి ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. విజిల్ మహాలక్ష్మి గా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అటు డాన్స్ ప‌రంగా బుల్లెట్‌, విజిల్ సాంగ్‌లోనూ డాన్స్ చేసి అర‌లిస్తుంది. రామ్ డాన్స్‌తో మెస్మ‌రైజ్ చేశాడు. ఇక మిగిలిన పాత్ర‌లు క‌థ‌లో భాగంగా వ‌చ్చిపోతుంటాయి. రామ్ త‌ల్లిగా న‌దియా న‌టించింది.  
 
- ప్రాణం తీస్తే మ‌రో ప్రాణం పోయాలి అన్న రూల్‌.. గురు పాత్ర ద్వారా మ‌నిషి ప్రాణం తీశాక‌ మొక్క నాటుతాడు. ఇది త‌న త‌ల్లినుంచి నేర్చుకున్న విద్య అత‌నిది. ఇక డాక్ట‌ర్‌గా మ‌నిషి ప్రాణం కాపాడాల‌న్న‌దే స‌త్య త‌ల్లి చెప్పిన మాట‌. ఇందులో ఇద్ద‌రు భిన్న‌మైన త‌ల్లుల పాత్ర‌లు. భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాల కొడుకులు చ‌క్క‌గా ద‌ర్శ‌కుడు హైలైట్ చేశాడు.
 
- స‌న్నివేశాలు కొన్ని మ‌నం ఊహించిన‌ట్లే సాగిపోతున్నా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా తీయ‌డం ద‌ర్శ‌కుడి టెక్నిక్‌గా చెప్పొచ్చు. ఇందుకు క‌థ‌నంలో స్పీడ్ బాగా తోడ్ప‌డింది.
 
- సాంకేతికంగా చూస్తే, దేవీవ‌ర‌ప్ర‌సాద్ స‌హ‌జ‌స్థాయిలో బాణీలున్నాయి. నేప‌థ్య సంగీతం స‌న్నివేశ‌ప‌రంగా ఇచ్చాడు. దానికి తోడు సినిమాటోగ్ర‌పీ పిక్చరైజేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక ఎడిటింగ్ ప‌రంగా చెప్పాలంటే  కొన్నిచోట్ల స్లోగా సాగిన కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి. లింగుస్వామి. రచయితగా కంటే ద‌ర్శ‌కుడిగా మెప్పించాడు.  యాక్షన్‌తో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు
- ఇది సినిమానేకాదు. డాక్ట‌ర్‌గా పోలీసుగా సేవ‌లు అందించిన వారిని క్ల‌యిమాక్స్‌లో చూపిస్తూ వారి స్పూర్తిగా చిత్రాన్ని తీసిన‌ట్లు చూపించ‌డం బాగుంది.
 
- మాస్ యాక్ష‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్రం బాగా అల‌రిస్తుంది.
రేటింగ్‌-3/5  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకుడు వర్మకు సారీ చెప్పిన యాంకర్ శ్యామల