Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుమనీ కోటలో హిందు విగ్రహాలా... సైరా షూటింగ్‌ను అడ్డుకున్న ముస్లింలు

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:18 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్ర "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రం షూటింగ్‌ను బీదర్‌ పట్టణంలో స్థానిక ముస్లిం యువకులు అడ్డుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణకు ముస్లిం యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో అక్కడి బహుమనీ సుల్తాన్‌ కోట చుట్టుప్రక్కల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
సినిమా చిత్రీకరణ మహుమని కోటలో ముస్లిం ప్రార్థనా స్థలంలో జరుగుతున్నందున ఆ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలు ఉంచరాదన్న ప్రధాన కారణంతో ముస్లిం యువకులు గుంపుగా వచ్చి అడ్డుకున్నట్లు తెలిసింది. షూటింగ్‌ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలను తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బీదర్‌ జిల్లా అధికారి నివాసం ముందు వారు ఆందోళన నిర్వహించారు.
 
చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి, కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌పై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. తెలుగులో భారీ తారాగణంతో నిర్మిస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం హిస్టారికల్‌ సినిమా కావడంతో నగరంలోని బహుమనీ కోటలో హిందూ విగ్రహాలను పెట్టుకుని షూటింగ్‌ సెట్‌ వేశారు. అయితే ముస్లిం యువకులు షూటింగ్‌కు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పురాతత్వ శాఖద్వారా అనుమతి పొందినా చిత్రీకరణను యువకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విచ్చేసి హిందూ విగ్రహాలను, చిత్రీకరణకు వేసిన సెట్‌ను తొలగించినట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments