బాల సింగింగ్ కాంటెస్ట్ ద్వారా బాలుకి సంగీత నివాళి

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (13:18 IST)
Sp Balu nivali
ఈ సంవత్సరం ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం జయంతి (జూన్ 4) నుండి ప్రపంచ సంగీత దినోత్సవం (జూన్ 21) వరకు మ్యాజిక్  FM ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంది. లెజెండ్ ఎస్పిబి గారి జ్ఞాపకార్థం పిల్లలకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పిల్లలు కేవలం ఎస్పీబీ పాటలు మాత్రమే పాడారు. ఈ తరం పిల్లలకు SPB యొక్క సంగీతాన్ని మరియు ఆయన గొప్పతనాన్ని తెలియజేయడమే BGG కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశ్యం. మ్యాజిక్ 106.4 ఎఫ్‌ఎమ్‌ ఆదర్వ్యంలో ఈ సంగీత నివాళి నిర్వహించబడింది. ఈ పోటీ యొక్క మొత్తం ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారి వీడియోలను వాట్సాప్ ద్వారా మరియు మ్యాజిక్ ఎఫ్.ఎం డిజిటల్ పేజీలకు పంపించారు. 
 
ఎస్‌పిబి కుమారుడు ఎస్పీ చరణ్, కోటి, ఆర్‌పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ, కెఎమ్ రాధాకృష్ణన్ వంటి ప్రముఖులు బి‌జి‌జి కార్యక్రమాన్ని అభినందించి ప్రోత్సహించారు. అంతే కాదు ఈ  బి‌జి‌జి కాంటెస్ట్ కు సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి టాప్ 5 సింగర్స్  ను ఎంపిక చేశారు. టాప్ 5 ఫైనలిస్టుల్లో ప్రియాంక ప్రభాకరన్, సంజన, వెంకట శ్రీకీర్తి, ధ్రువ ప్రజ్వల్, తన్విలు  నిలవగా.. విజేతలుగా ప్రియాంక ప్రభాకరన్ మరియు సంజనలు బహుమతులు కైవసం చేసుకున్నారు.
 
జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం రోజున బిజిజి విజేతలు మ్యాజిక్ 106.4 ఎఫ్ఎమ్ స్టూడియోలో.. ఆర్జే రవలి, ఆర్జే కల్యాణ్, ఆర్జె నాటీ నాని, ఆర్జె ప్రతీకల చేతులు మీదగా ట్రోపిలను అందుకున్నారు అలాగే విజేతలకు 5000/- విలువైన గిఫ్ట్ వోచర్లు కూడా అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments