Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో విజయ్‌ దేవరకొండ విడుదల చేసిన మ్యూజిక్‌ స్కూల్‌ ట్రైలర్‌

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (18:43 IST)
Shriya Saran
స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైంది ‘మ్యూజిక్‌ స్కూల్‌’ ట్రైలర్‌. ముంబైలో మ్యూజిక్‌ స్కూల్‌ ట్రైలర్‌ వేడుక ఘనంగా జరిగింది. దర్శకనిర్మాత పాపారావు బియ్యాల, శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్‌ని విజయ్‌ దేవరకొండ డిజిటల్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. 
 
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. చక్కటి సంగీతం, ఆసక్తికలిగించే డ్రామా, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు, వినోదాన్ని పంచే దృశ్యాలతో ఆకట్టుకుంటోంది ట్రైలర్‌. 
 
ఈ సినిమాలో శ్రియా శరణ్‌, శర్మన్ జోషి సంగీత, నృత్య టీచర్లుగా నటించారు. గ్రేసీ గోస్వామి, ఓజు బారువాతో పాటు మరికొంతమందికి ది సౌండ్‌ ఆఫ్ మ్యూజిక్‌ పేరుతో ఓ మ్యూజికల్‌ ప్లేని ఏర్పాటు చేస్తారు. సమాజం, టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలపై పెంచుతున్న ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్‌ ఇవ్వడం కోసం మ్యూజిక్‌, డ్యాన్స్ టీచర్లు చేసిన ప్రయత్నం మెప్పిస్తోంది. మ్యూజికల్‌ జర్నీలా అనిపిస్తోంది. డ్రామా, వినోదం, భావోద్వేగాలు, సంగీతం మిళితమై అందమైన ప్యాకేజ్‌లా కనిపిస్తోంది ట్రైలర్‌. గోవా పరిసరాల్లోని అత్యద్భుతమైన లొకేషన్లు కన్నులవిందు కలిగిస్తున్నాయి. 
 
నేటి తరం విద్యార్థుల మీద తల్లిదండ్రులు, గురువురు, సమాజం మోపుతున్న ఒత్తిడిని సున్నితంగా, అర్థవంతంగా, సంగీత  ప్రధానంగా చెప్పే ప్రయత్నమే మ్యూజిక్‌ స్కూల్‌. ఈ సినిమాలో పదకొండు పాటలున్నాయి. భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇందులోని మూడు పాటలను, అత్యద్భుతమైన సౌండ్‌తో డిజైన్‌ చేశారు. 
 
పడ్తో జావో బచ్చా, తేరి నిగాహో నే, హాచ్‌కౌలే అనే పాటలను ఆ మధ్య విడుదల చేశారు.
అత్యద్భుతమైన ప్యాషన్‌తో ఫిల్మ్ మేకర్‌గా మారిన ఐఏయస్‌ ఆఫీసర్‌ పాపారావు బియ్యాల ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 
 
తమ తమ రంగాల్లో నిపుణులైన టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. కిరణ్‌ డియోహాన్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 
 
శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఓజు బావురా, గ్రేసీ గోస్వామీ ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. బెంజమిన్‌ గిలానీ, సుహాసిని మూలే, మోనా అంబేగోయంకర్‌, లీలా సామ్‌సన్‌, బగ్స్ భార్గవ, వినయ్‌ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్‌, వాక్వార్‌ షేక్‌, ఫణి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. పలువురు బాల నటీనటుల్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు.
 
మ్యూజిక్‌ స్కూల్‌ని యామిని పిల్మ్స్ నిర్మిస్తోంది. హిందీ, తెలుగులో  తెరకెక్కించారు. తమిళంలోకి అనువదించారు. మే 12న పీవీఆర్‌ ద్వారా హిందీలో విడుదల చేస్తున్నారు. తెలుగులో దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments