Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై డ్రగ్స్ కేసు : చిక్కుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (14:12 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇపుడు మరో మలుపు తిరిగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
బాలీవుడ్ బాద్ షా షారూక్ నివాసంపై కొద్ది సేపటి క్రితం ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. బాంద్రాలో ఉన్న షారూక్ నివాసం మన్నత్‌కు ఎన్‌సీబీ అధికారలు వచ్చి గాలింపులు చేపడుతున్నారు. అలాగే బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే ఇంటికి కూడా ఎన్‌సీబీ టీమ్ చేరుకుంది. 
 
సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య.. ఆర్యన్‌కు మంచి స్నేహితురాలు. ఆర్యన్ ఫోన్ చాటింగ్‌లో అనన్య పేరు ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన చాటింగ్ సంభాషణలను కూడా కోర్టుకు ఎన్సీబీ అధికారులు ఓ నివేదిక రూపంలో సమర్పించారు. 
 
ఈ నేపథ్యంలో ముంబైలోని ఖార్ వెస్ట్‌లో ఉన్న ఆమె ఇంటిపై కూడా ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యను ఆదేశించారు. ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న కొడుకును షారూక్ కలిసిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం విశేషం. కాగా, అనన్య పాండే హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫైటర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments