Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమైత్ ఖాన్ వద్ద ఈడీ విచారణ... ఆ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించలేదు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:53 IST)
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ చేపట్టిన దర్యాప్తు టెన్షన్ పుట్టిస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈడీ విచారణకు నిన్న ముమైత్ ఖాన్ హాజరయింది. దాదాపు 7 గంటలపాటు కొనసాగిన విచారణలో ముమైత్‌కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలను సంధించారు. ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులైన జీషాన్, కెల్విన్‌లతో గల ఆర్థిక సంబంధాలపై ఆమెను ప్రశ్నించారు.
 
ఈడీ ప్రశ్నలకు బదులుగా ముమైత్ ఖాన్ స్పందిస్తూ... తన స్నేహితులతో కలిసి హైదరాబాదులో తాను కొన్ని పార్టీల్లో పాల్గొన్నానని, ఆ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించలేదని తెలిపింది. కెల్విన్, జీషాన్‌లు తనకు అక్కడే తెలుసని... అయితే, వారితో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని ఆమె చెప్పింది. తన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఈడీ అధికారులకు ముమైత్ అందించింది.
 
మరోవైపు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ముమైత్ నుంచి ఈడీ అధికారులు వివరణ తీసుకున్నారు. హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్ కు ముమైత్ ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వీటిపై ఈడీ అధికారులు ప్రశ్నించగా... అవి కేవలం పార్టీలకు సంబంధించిన లావాదేవీలేనని ముమైత్ సమాధానమిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments