ప్రపంచ వ్యాప్తంగా ది లయన్ కింగ్ సినిమాకి అభిమానులు ఉన్నారు. 1994లో వచ్చిన యానిమేషన్ సినిమా నుండి ఈ పరంపర మొదలైంది. ఆ మానియా ఎన్నాళ్ళైనా తగ్గకపోయేసరికి మేకర్స్ రియలిస్టిక్ 3D యానిమేషన్ లో ఇంకో సారి చిత్రీకరించి 2019లో విడుదల చేశారు. అది కుడా పెద్ద సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు కింగ్: ముఫాసా కథని బేస్ చేసుకుని ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఒక రాజుగా ఎలా ఎదిగాడు అనే కథాంశం మీద ఈ ముఫాసా: ది లయన్ కింగ్ ని ఈ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా కాబట్టి ప్రేక్షకుల నుండి ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విశేష స్పంధన ట్రైలర్ కు లభించింది.
ఈ చిత్రాన్ని బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్నారు, ప్రేక్షకులకి రియలిస్టిక్ ఫీలింగ్ కలిగేలా లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ని ఫోటో రియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీలో తీస్తున్నారు. ఈ మానియాని ఎంజాయ్ చెయ్యడానికి dec 20 కోసం ముఫాసా: ది లయన్ కింగ్ ఫాన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.