Webdunia - Bharat's app for daily news and videos

Install App

విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సోనూసూద్ ను ఆహ్వానించిన‌ ఎంఆర్పిఎస్ నేతలు

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (13:06 IST)
Sonusood-MRP
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ను ఏపీ ఎంఆర్పీఎస్ కడప జిల్లా వీరబల్లి మండల నేతలు నరసింహులు, వర్ల వెంకటరమణ, రామ్మోహన్ లు కలిశారు. ఆదివారం వీరు ముంబైలోని సోనూ సూద్ నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. మండలంలోని గడికోట గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని సోనూసూద్ ను ఏపీ ఎంఆర్పిఎస్ నేతలు ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

కాలు పోగొట్టుకొన్న విద్యార్థికి వైద్య ఖర్చులు బరిస్తా : సోనూసూద్
 
గడికోట గ్రామం జల్లేవాండ్లపల్లెకు చెందిన వెంకటసాయి చంద్ర అనే విద్యార్థి రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు కు తీవ్ర గాయం కాగా డాక్టర్లు ఆపరేషన్ చేసి కాలు ను తొలగించారు. ఈ భాదిత విద్యార్థి వెంకట సాయి చంద్రను ఏపీ ఎంఆర్పిఎస్ నేతలు ముంబైలోని సోనూసూద్ వద్దకు తీసుకెళ్లారు. విద్యార్థిని చూసిన సోనూసూద్ చెలించిపోయారు. ఆ భాదిత విద్యార్థి ని వెంటనే మొంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కి పంపించి వైద్య పరిక్షలు చేయించుకోమని తెలిపారు. కాలు బాగు అయ్యేవరకు ముంబైలోనే ఉండి చూపించుకోమని సలహా ఇచ్చారు. ఆ విద్యార్థికి వైద్య ఖర్చులు ఎంతైనా తానే భరిస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చినట్లు ఏపీ ఎంఆర్పిఎస్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ నేతలు ప్రసాద్, సంజీవ, మురళీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments