Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తొలిప్రేమ' సన్నివేశాలను గుర్తుకు తెచ్చే 'మిస్టర్ మజ్ను' (మూవీ రివ్యూ)

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (15:53 IST)
చిత్రం : మిస్టర్ మజ్ను
నిర్మాణ సంస్థ : శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం : అఖిల్ అక్కినే, నిధి అగర్వాల్, జయప్రకాష్, రావు రమేష్, నాగబాబు, హైపర్ ఆది, అజయ్, సుబ్బరాజు తదితరులు
సంగీతం : ఎస్.ఎస్. థమన్
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం : వెంకీ అట్లూరి
విడుదల : శుక్రవారం, జనవరి 25, 2019
 
అక్కినేని వంశం నుంచి వచ్చి మూడోతరం హీరో అఖిల్ అక్కినేని. టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈయన నటించిన తొలి రెండు చిత్రాలు 'అఖిల్', 'హలో'లు పూర్తిగా నిరాశపరిచాయి. అంటే డెబ్యూ హీరోగా అఖిల్‌కు మంచి మార్కులు పడినప్పటికీ.. ఆ రెండు చిత్రాలు భారీ ప్లాప్‌లుగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సరైన హిట్ కోసం పరితపిస్తున్న అఖిల్.. "మిస్టర్ మజ్ను"తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్ర కథ ఎలా ఉందో తెలుసుకుందాం. 
 
కథ : 
విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ అలియాస్ కృష్ణ అనే కుర్రోడు అమెరికాలో ఎం.ఎస్. చదువుతుంటాడు. చాలా అందంగా ఉండటంతో అతన్ని చూడగానే ప్రతి అమ్మాయి. ఇష్టపడుతుంది. ఆ అమ్మాయిలు తన జీవితంలోకి వచ్చినా.. వెళ్లినా పెద్దగా పట్టించుకోడు. అదేసమయంలో తనకు రాముడు వంటి భర్త కావాలని నిక్కి (నిధి అగర్వాల్) కోరుకుంటుంటుంది. ఈ క్రమంలో విక్కీతో నిక్కికి పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ ఒకేసారి భారత్‌కు వస్తుంటారు. 
 
అయితే, వీరిద్దరూ కాబోయే చుట్టాలమనే విషయం విమానాశ్రయంలోనే తెలుస్తుంది. నిక్కి అన్న (రాజా)కు, విక్కీ చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటారు. అలా విక్కీ, నిక్కీ బంధువుల‌వుతారు. నిక్కీకి ఆడ‌ప‌డుచు లాంఛ‌నాలు పెట్ట‌డానికి విక్కీ తండ్రి కొంచెం డ‌బ్బులిచ్చి విక్కీని ద‌గ్గ‌రుండి చూసుకోమంటాడు. అలా విక్కీ, నిక్కీలు మరింతగా దగ్గరవుతారు. అత‌నంటే ఆమెకు ఇష్టం క‌లుగుతుంది. రెండు నెల‌ల్లో అది ప్రేమ‌గా మారుతుందేమోన‌ని టెస్ట్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం నిజంగానే ప్రేమగా మారిందా? ఆ ప్రేమ పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లిందా? వెళ్లక‌పోతే వారి ప్రేమ‌కు వ‌చ్చిన అవాంత‌రాలేంటి? వాటికి విక్కీ కార‌ణ‌మా? నిక్కీ కార‌ణ‌మా? వంటి అంశాలు సినిమాలో చూడాల్సిందే.
 
కథా విశ్లేషణ : 
నేటికాలంలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చినవిధంగా ఉండాలని కోరుకుంటారు. జీవితంలోకి వ‌చ్చే అవ‌త‌లివారు చెప్పే మార్పుల‌ను ఏదో కాసేపు వినాల‌నుకుంటున్నారు. ఆ కాసేపు త‌ర్వాత కూడా అది కొన‌సాగితే ఒక విధంగా ఫీలవుతారు. దాన్నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని అనుకున్న త‌రుణంలోనే గొడ‌వ‌లు, దూరాలు పెరుగుతున్నాయి. 'మిస్ట‌ర్ మ‌జ్ను' కూడా ఒక రకంగా ఇలాంటి చిత్రమే. 'మిస్ట‌ర్ మ‌జ్ను'లో నాయిక త‌న‌కు రాముడిలాంటి భ‌ర్త కావాల‌నుకుంటుంది. అయితే విక్కీ చెప్పే కొన్ని డైలాగులు విన్న త‌ర్వాత ఆమె మ‌న‌సు మారుతుంది. అత‌నిలోనూ మంచి ల‌క్ష‌ణాల‌ను చూడ‌టం మొద‌లుపెడుతుంది. అత‌ని మీద అతి ప్రేమ‌ను చూపిస్తుంది. అప్ప‌టివ‌ర‌కు అలాంటి ప్రేమ‌ను ఆస్వాదించ‌ని విక్కీకి అది అతిగా అనిపిస్తుంది. 
 
ఆ ఉక్కిరిబిక్కిరి ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌కు రావాల‌నుకుంటాడు. అయితే ఆ విష‌యాన్ని అమ్మాయితో కాకుండా, త‌న ఫ్రెండ్‌తో చెబుతుంటే... నిక్కి వింటుంది. ఆత్మాభిమానం ఉన్న ఆమె విక్కీ నుంచి దూరం జ‌రుగుతుంది. ఆమె దూర‌మైన త‌ర్వాతగానీ అత‌నికి ఆమె త‌న‌పై చూపించిన నిజ‌మైన ప్రేమ అర్థం కాదు. అక్క‌డి నుంచి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక ఆమెను ఇంప్రెస్ చేయ‌డ‌మే హీరో ప‌ని. ఇక్క‌డివ‌ర‌కు క‌థ బాగానే సాగినా, ఆ త‌ర్వాతే రొటీన్‌గా అనిపిస్తుంది. అయితే, ఈ చిత్రంలోని సన్నివేశాలు వరుణ్ తేజ్ తొలిప్రేమలోని సన్నివేశాలను తలపిస్తాయి. 
 
మొదటిభాగం బాగానే ఉన్నప్పటికీ రెండో భాగం మాత్రం సాగదీత ధోరణితో ముందుకుసాగుతుంది. ఇకపోతే, అఖిల్ అటు ఫైట్లలో, డ్యాన్సుల్లో బాగా చేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో చెప్పే డైలాగులు బాగా ఆలోచింపజేస్తాయి. రిలేష‌న్‌షిప్‌లో ఉండేవారికి, అందులో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వారికి కాస్త క‌నెక్ట్ అయ్యే సినిమా. లాజిక్కులు మ‌ర్చిపోయే చూస్తే బాగానే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల‌ను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా, ఇంకాస్త కొత్త‌గా రాసుకునివుంటే సినిమాకు తిరుగులేకుండా ఉండేది. 
 
ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, హీరో అఖిల్ నట, అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్, అక్కడక్కడా డైలాగులు, చిత్రంలోని కొన్ని పాటలు, అలాగే, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, పాత కథ, సీన్స్‌లోని కొత్తదనం లేకపోవడం, కన్విన్సింగ్‌గా లేని రెండో అర్థభాగం వంటి సన్నివేశాలు మైనస్‌గా చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments