Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది

డీవీ
గురువారం, 26 సెప్టెంబరు 2024 (16:49 IST)
date poster released by paruchuri bro.
బయట సెలబ్రిటీలపై రకరకాల కామెంట్లు చేస్తున్న పాయింట్ తో మిస్టర్ సెలబ్రిటీ రాబోతుంది. ఈ క్రమంలోనే సుదర్శన్ పరుచూరి  హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. 
 
ఇది వరకు మిస్టర్ సెలెబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ రిలీజ్ చేశారు. అక్టోబర్ 4న ఈ చిత్రం రానుందని ప్రకటించారు.
 
 *అనంతరం పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..* ‘మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన మిస్టర్ సెలెబ్రిటీ అక్టోబర్ 4న రాబోతోంది. మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కొత్త దర్శకుడైనా కూడా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అక్టోబర్ 4న తప్పకుండా మిస్టర్ సెలెబ్రిటీ సినిమాను చూడండి’ అని కోరారు.
 
 *పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..* ‘మమ్మల్ని ప్రేక్షకులు ఈ నలభై ఏళ్లుగా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా మనవడు పరుచూరి సుదర్శన్ అక్టోబర్ 4న మిస్టర్ సెలెబ్రిటీ ద్వారా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గొప్పగా నిర్మించారు. దర్శకుడు అద్భుతంగా సినిమాను తీశారు. మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయండి’ అని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో 'జీవితపుత్రిక'.. పవిత్ర స్నానాల చేస్తూ 43మంది మృతి

సినీ ఫక్కీలో కిడ్నాప్.. రాబరీ.. కార్లలో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు.. (video)

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

చెరువులోనే నాలుగు అంతస్థుల ఇల్లు.. స్కై వాక్‌లా మెట్లు.. కూల్చేశారు.. (video)

నిలోఫర్ ఆస్పత్రిలో పేకాట.. నలుగురు మహిళల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments