Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైవిధ్యం పేరుతో ప్రభాస్ తో ప్రయోగాలు చేస్తున్న దర్శకులు

Advertiesment
Prabhas

డీవీ

, గురువారం, 26 సెప్టెంబరు 2024 (11:04 IST)
Prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో ఆయన ఆహార్యంపై దర్శకులు ప్రయోగాలు చేస్తున్నారు. ఛత్రపతితో దర్శకుడు రాజమౌళి చేసిన ప్రయోగం నార్మల్ గా వున్నా. ఆ తర్వాత బిల్లా, డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్, బుజ్జిగాడు వంటి సినిమాల్లో కాస్త కొత్తదనం చూపాడు. కానీ బాహుబలితో ప్రభాస్ గెటప్ ను పూర్తిగా మార్చేశాడు రాజమౌళి. రెండు భాగాలుగా వచ్చిన ఆ సినిమా ఎంతపేరు తెచ్చిపెట్టందో చెప్పనవసరంలేదు. ప్రపంచ స్టార్ గా ఎదిగాడు. ఆ ఎదుగుదలే ఆయనకు కొన్ని కష్టాలు తెచ్చిపెట్టింది కూడా.
 
ఆ తర్వాత సినిమాచేయాలంటే దర్శకులు చాలా మార్పులు కోరుతున్నారు. సాహో, రాధే శ్యామ్ వంటి పాత్రలతోపాటు ఆదిపురుష్ సినిమాలు వచ్చాయి. వాటిల్లోనూ కొత్తదనం ఏమీ కనిపించకపోవడంతోపాటు కథల్లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో నిరాశే మిగిల్చింది. కానీ అనంతరం సలార్ చిత్రం ప్రభాస్ కు ఊపిరి పోసింది. ఇప్పుడు దాని సీక్వెల్ కూడా చేయడానికి ప్రణాళిక సిద్ధం అవుతుంది. ఆ తర్వాత వచ్చిన ఆదిపురుష్ సినిమా రాముడిగా చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాలో మొదటి నుంచి అవరోధాలు వచ్చాయి.
 
ఇక కల్కి సినిమా తర్వాత మరోసారి హిట్ ను సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు నాలుగు సినిమాలు బిజీలో వున్నాడు. దర్శకుడు మారుతీ చేస్తున్న రాజాసాబ్ సినిమా తను ఎప్పటినుంచో కోరుకుంటున్న యాక్షన్ పెద్దగా లేని ఫీల్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. మరోవైపు దర్శకుడు హను రావిపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రంలో ప్రభాస్ గెటప్ ను పూర్తిగా మార్చేస్తున్నారు. క్లీన్ షేవ్ తో వుండేలా దర్శకుడు ప్లాన్ చేశాడు. మిర్చి గెటప్ దించేశాని తెలుస్తోంది. 
 
ఇక త్వరలో విడుదలకాబోతున్న మంచు విష్ణు సినిమా కన్నప్పలో ప్రభాస్ దేవుని అవతారంలో కనిపించనున్నారు. ఈ గెటప్ ఇంకా బయటకు రాలేదు. మరోవైపు సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్నస్పిరిట్ చిత్రంలో సరికొత్తగా ప్రభాస్ ను చూపాలని హాలీవుడ్ స్టార్ తరహా గెటప్ తీసుకురాబోతున్నాడు. ఇందుకు ప్రభాస్ పూర్తిగా జుట్టుపెంచాల్సి వుంది. అనంతరం ఫౌజి సినిమాకూ కోరమీసాలు వుండేలా ఆహార్యాన్ని తగు విధంగా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండు సినిమాల్లో కథానాయికలు హాలీవుడ్ భామలు కూడా నటించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ తో దర్శకులు సక్సెస్ కోసం పడుతున్న ప్రయోగాలు వినియోగం కావాలని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకుల కోసం కోర్టుకెక్కిన 'రంగేలీ' భామ