Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ ప్రారంభం

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (08:25 IST)
Mr. Bachchan opening
మాస్ మహారాజా రవితేజ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. తన కొన్ని సినిమాలలో బిగ్ బిని అనుకరిస్తూ అలరించారు. అసలు విషయానికి వస్తే.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో రవితేజ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు 'మిస్టర్ బచ్చన్' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ రవితేజ అమితాబ్ బచ్చన్ ఐకానిక్ పోజ్‌ను అనుకరిస్తున్నట్లు అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
 
రవితేజ పాత స్కూటర్‌పై షేడ్స్‌తో స్టైల్‌గా కూర్చుని కనిపిస్తున్నారు. అతని వెనుక నటరాజ్ థియేటర్, అమితాబ్ బచ్చన్ ఇమేజ్ చూడవచ్చు. అతను సినిమా లవరా? సినిమాలో అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానా? 'బిగ్ బి-నామ్ తో సునా హోగా' అనే పాపులర్ డైలాగ్ ఈ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ పోస్టర్ మాస్, అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది.
 
ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయిక గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్,  టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.
 
మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
 
ఈరోజు చిత్రబృందం, అతిధుల సమక్షంలో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయింది. హీరో రవితేజ, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, రఘు రామకృష్ణ స్క్రిప్ట్‌ను దర్శకుడు హరీష్ శంకర్‌కి అందజేశారు. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు కుమార్ మంగత్ పాఠక్ క్లాప్‌ కొట్టగా, కె రఘు రామకృష్ణ, టిజి భరత్ కలిసి కెమెరా స్విచాన్ చేసారు. ముహూర్తం షాట్‌కు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ముహూర్తం షాట్ కోసం “మిస్టర్ బచ్చన్... నామ్ తో సునా హోగా!” డైలాగ్ ని చెప్పారు రవితేజ.
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐను కాల్చి చంపేసిన కానిస్టేబుల్.. ఎక్కడ?

దివ్యాంగురాలి కోటాలో టీచర్ ఉద్యోగం.. తొలగింపు సబబేనన్న హైకోర్టు

దీపం 2.0 పథకం కింద ఉచిత సిలిండర్ కావాలంటే ఇవి ఉండాల్సిందే..

బైక్ రైడ్‌ను రద్దు చేసిన మహిళ... అసభ్య వీడియోలతో డ్రైవర్ వేధింపులు...

5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు... ఆ రాష్ట్రాల చేతిలోనే అభ్యర్థుల భవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments