దేశంలో ఐదో స్థానం... సౌతిండియాలో ఏకైక స్టార్ ప్రభాస్...

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే సమాధానం ప్రభాస్ అని. "బాహుబలి" చిత్రం తర్వాత జాతీయ స్థాయి హీరోనే కాదు.. ఇంటర్నేషనల్ స్థాయి హీరోగా మారిపోయారు. ఇపుడు మరో అరుదైన రికార్డును సొంతం

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (15:05 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే సమాధానం ప్రభాస్ అని. "బాహుబలి" చిత్రం తర్వాత జాతీయ స్థాయి హీరోనే కాదు.. ఇంటర్నేషనల్ స్థాయి హీరోగా మారిపోయారు. ఇపుడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
 
దేశంలో ఉన్న సూపర్‌స్టార్లలో ప్రభాస్ ఐదో స్థానంలో నిలిచాడు. సౌత్‌లోని ఇతర స్టార్లను దాటేసి భారీ ఫాలోయింగ్‌తో అతను ఈ స్థానం దక్కించుకున్నాడు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్-2018'ను ఇటీవల నిర్వహించింది. అందులో సెలబ్రిటీలు సాధించిన ఓట్లనుబట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. 
 
ఆ జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ల సరసన ప్రభాస్ నిలవడం విశేషం. ఈ పోల్‌లో డిఫరెంట్ కేటగిరీలున్నాయి. అందులో మేల్ సూపర్‌స్టార్ కేటగిరీలో ప్రభాస్ ఐదో ర్యాంక్ సాధించడం విశేషం. మొదటి స్థానంలో సల్మాన్‌ ఖాన్, రెండో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. షారుఖ్‌ ఖాన్, రణబీర్‌ కపూర్‌లు మూడో స్థానాన్ని పంచుకోగా 'బిగ్ బి' అమితాబ్‌ బచ్చన్ నాలుగో స్థానం సాధించారు. 
 
ఇక ప్రభాస్, రణవీర్ సింగ్‌లు ఇద్దరూ సంయుక్తంగా ఐదో ర్యాంక్‌లో నిలిచారు. ఇక్కడ ప్రభాస్ ఘనత ఏమిటంటే… టాప్-5లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సౌత్ ఇండియన్ స్టార్ అతను కావడం విశేషం. ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌ను ఇది మరోసారి రుజువు చేసింది. మరోవైపు మోస్ట్ పాపులర్ ఫిమేల్ సూపర్‌స్టార్ విభాగంలో దీపిక పదుకునే, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మలు టాప్ ర్యాంక్ సాధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments