Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోకో ఎఫ్1 ఫోన్‌ని లాంఛ్ చేసిన క్జియోమీ

చైనా మొబైల్ సంస్థ క్జియోమీ భారత మార్కెట్‌లోకి సరికొత్త మోడళ్లలో మొబైల్‌లను విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు తన సబ్‌బ్రాండ్ పోకోఫోన్ పేరుతో సరికొత్త మోడల్‌ని లాంఛ్ చేయడానికి సిద్ధమైంది. ఈ మోడళ్లలో మొదటిగా పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ని లాం

Advertiesment
పోకో ఎఫ్1 ఫోన్‌ని లాంఛ్ చేసిన క్జియోమీ
, బుధవారం, 22 ఆగస్టు 2018 (22:25 IST)
చైనా మొబైల్ సంస్థ క్జియోమీ భారత మార్కెట్‌లోకి సరికొత్త మోడళ్లలో మొబైల్‌లను విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు తన సబ్‌బ్రాండ్ పోకోఫోన్ పేరుతో సరికొత్త మోడల్‌ని లాంఛ్ చేయడానికి సిద్ధమైంది. ఈ మోడళ్లలో మొదటిగా పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌ను మాస్టర్ ఆఫ్ స్పీడ్‌గా కంపెనీ పేర్కొంది. భారత్‌లో పోకోఫోన్ ఎఫ్1 ప్రారంభ ధరను రూ.20,999గా నిర్ణయించింది. 
 
ఆగస్ట్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనుంది. లాంచింగ్ ఆఫర్‌లలో భాగంగా రిలయన్స్ జియో భారీ ఆఫర్‌ను అందిస్తోంది. కస్టమర్లకు మునుపెన్నడూ లేని విధంగా రూ.8 వేల తక్షణ ప్రయోగాలను ఆఫర్ చేయనుంది. అది కూడా 6టీబీ హైస్పీడ్ డేటాతో అందించనుంది. దీంతోపాటు హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ ద్వారా కొనుగోళ్లు చేసినట్లయితే వెయ్యి రూపాయిల తగ్గింపు లభించనుంది.
 
పోకోఫోన్ ఎఫ్1 ఫీచర్లు ఇవే:
*6.18 అంగుళాల డిస్‌ప్లే
*1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్
*స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
*20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
*12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా
*4000ఎంఏహెచ్ బ్యాటరీ
*ఐఆర్ ఫేస్ అన్‌లాక్,
*1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్
 
అంతేకాకుండా ఈ ఫోన్ బ్లూ, గ్రే రంగుల్లో అందుబాటులోకి రానుంది. అందులో ర్యామ్ మరియు స్టోరేజీ ఆధారంగా చేసుకుని 6జీబీ+64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 20,999, 6జీబీ+128జీబీ స్టోరేజ్‌ ఫోన్ ధర రూ. 23,999, 8జీబీ+256జీబీ స్టోరేజ్‌ రూ. 28,999, ఆర్మర్డ్ ఎడిషన్ 8జీబీ+256జీబీ ఫోన్ ధరను రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధూని విమర్శించేవాళ్లంతా దేశద్రోహులా?