Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబ‌ర్ 2 నుంచి 3కు మారిన‌ మోహన్ లాల్ - మరక్కార్ విడుద‌ల‌

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (18:56 IST)
Mohanlal
మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ భారీ చిత్రం మరక్కార్. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు కానీ డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది.
 
మరక్కార్ సినిమా మీద మళయాలంలోనే కాకుండా తెలుగులో మంచి బజ్ ఏర్పడింది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని  రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
 
మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. జనతా గ్యారెజ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
 
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌ మీద ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ సినిమాను కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
 
అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రయదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments