Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుదేవా, రెజీనా, అనసూయల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి?

Advertiesment
ప్రభుదేవా, రెజీనా, అనసూయల ఫ్లాష్ బ్యాక్ ఏమిటి?
, శుక్రవారం, 26 నవంబరు 2021 (18:20 IST)
Flack Black poster
ప్రభుదేవా, రెజినా, అనసూయల కాంబినేషన్‌లో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇది వరకు రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
 
ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల మూవీకి సంబంధించిన రెండు విభిన్న పోస్టర్లను విడుదల చేశారు. మొదటి దాంట్లో ప్రభుదేవా, రెజీనాలో లవ్ ట్రాక్ చూపిస్తే. రెండో దాంట్లో అనసూయ తన లుక్‌తో ఆకట్టుకుంది. ఈ రెండు  పోస్టర్లకు  విశేషమైన స్పందన లభిస్తోంది.
 
‘ఈ చిత్రం యూత్‌ను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. అంతకు మించి కథను చెప్పే విధానం బాగుంటుంది. టైటిల్, ట్యాగ్ లైన్‌తోనే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాలో  ప్రతీ సీన్ అన్ని వర్గాల ప్రేక్షకులను  ఆకట్టుకుంటుంది.
 
రెజీనా ఇందులో ఆంగ్లోఇండియన్ టీచర్‌  పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. అనసూయ పాత్ర సినిమాకు హైలెట్ కానుంది’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. . 
 
శామ్ సీఎస్ అందిస్తున్న మ్యూజిక్ ప్రధాన బలం. చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు అందిస్తున్నారు. 
 
ద్విభాష చిత్రంగా రాబోతోన్న ‘ఫ్లాష్ బ్యాక్’కు  తెలుగులో నందు తుర్లపాటి సంభాషణలు రచిస్తున్నారు. తమిళ డైలాగ్స్‌ను దర్శకుడే రాసుకున్నారు. నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
 
అద్భుతమైన స్టోరీకి కమర్షియల్ హంగులు జోడించి తెరకెక్కించబోతోన్నారు. ఇది వరకు ఎన్నడూ కూడా  ప్రేక్షకుల పొందని అనుభూతిని ఎక్స్‌పీరియెన్స్ చేయబోతోన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రేట్ ధనుష్, పెద్ద మనస్సుతో శివశంకర్ మాస్టరుకు సాయం