ముంబైలో ప్రారంభమైన మోహన్ లాల్, రోషన్ మేకాల వృషభ కొత్త షెడ్యూల్

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (11:34 IST)
Roshan, mohanlal and others
శ్రీకాంత్ కుమారుడు హీరో రోషన్ మేకా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'వృషభ'... 'ది వారియర్ అరైజ్' ట్యాగ్ లైన్. శనయ కపూర్‌, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు.

రోజు రోజుకీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించేలా మేకర్స్ సన్నాహాలు చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. వృషభ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు సినీ లవర్స్, ట్రేడ్ వర్గాల్లోనూ క్రియేట్ అయ్యాయి. దసరా రోజున ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.

రోషన్ మేకా, మోహన్ లాల్, శనయ కపూర్, జహ్రా ఖాన్, శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేదిల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన హాలీవుడ్ కి చెందిన నిక్ తుర్లో  నిక్ తుర్లోని ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తుండటం విశేషం. బాహుబలి, మన్యం పులి, ది బాస్, గజిని, రోబో, పుష్ప ది రైజ్ వంటి సినిమాలకు పని చేసి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments