Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కళాకృతిలోనే అతని రాజసం - వ్యక్తిత్వం ఉట్టిపడుతోంది... చిరంజీవి

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (14:30 IST)
మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టిన రోజు వేడుకను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉన్నారు. అలాగే, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 
 
అయితే, నటుడు మోహన్ బాబు తన మిత్రుడు చిరంజీవికి బర్త్ డే గిఫ్ట్ పంపిన విషయం ఆదివారం వెల్లడైంది. చిరంజీవి, మోహన్ బాబు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.
 
ఈ క్రమంలో చిరంజీవి తనకు మోహన్ బాబు ఇచ్చిన కానుకను ట్విట్టర్‌లో ప్రదర్శించారు. అది చెక్కతో చేసిన హార్లే డేవిడ్సన్ బైక్ నమూనా. దీనిపై మెగాస్టార్ హర్షం వ్యక్తం చేశారు. 
 
"నా చిరకాల మిత్రుడు తొలిసారిగా నా పుట్టినరోజు నాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి... థాంక్యూ మోహన్ బాబు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments