ఉప్పలపాటి కృష్ణంరాజుకు ఆయన పుట్టిన ఊరు మొగల్తూరు సంతాపసభ నిర్వహించింది. దాదాపు ఏడు గ్రామాల ప్రజలు ఈరోజు అనగా సెప్టెంబర్ 29న విచ్చేశారు. ప్రజల ఆదరణ, ఆప్యాయతలకు కృష్ణంరాజు జీవితభాగస్వామి శ్యామలా దేవి భావోద్వగానికి గురైయ్యారు. మొత్తం కుటుంబానికి, మొగలుత్తూరు ప్రజలకు భావోద్వేగ దినంగా నేరు ప్రజలు ప్రకటించుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు కృష్ణంరాజు కుటుంబ స్వగ్రామం. తెలుగునాట క్షత్రియ రాజుల వంశస్థులు విజయనగర సామ్రాజ్యం వారసులు కృష్ణంరాజు. ఈ సందర్భంగా రెబల్‌స్టార్ అంటూ ప్రజలు హాహాకారాలు చేస్తుండగా శ్యామాలదేవి కన్నీళ్ళు పెట్టుకున్నారు.
Shyamaladevi and daughters
ముందుగా కృష్ణంరాజు చిత్ర పటానికి నివాళులర్పించిన శ్యామలాదేవి తన కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తిలతో అభిమానులను సందర్శించారు.
ఈ సందర్భగా ప్రభాస్ వారందరినీ డార్లింగ్ అంటూ సంబోధిస్తూ, ఉత్సాహ పరిచారు. కాగా, అక్కడి రాజకీయనాయకులు కొందరు మాట్లాడుతూ, కృష్ణంరాజుగారు బిజెపిలో వున్న నాటినుంచి ఎం.పి. కోటా కింద చేసిన సేవలను గుర్తు చేశారు. వాజ్‌పేయ్ హయాంలో ఆయన నిధులను సద్వినియోగం చేసిన తీరు, అజాతశత్రువుగా పేరొంది ప్రజలకోసమే ఆయన పనిచేశారంటూ కీర్తించారు. ఆయన సేవలు కొనసాగిస్తామని ఈ ప్రజల తరఫున తెలియజేస్తున్నామని అన్నారు.
ఈరోజు కార్యక్రమానికి వై.సి.పి. నాయకురాలు, సినీనటి రోజా కూడా హాజరయ్యారు. శ్యామలాదేవిని వారి పిల్లలను, ప్రబాస్‌ను పరామర్శించారు.
వంటకాలు ప్రత్యేకం
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్కరణ సభ ఈరోజు నిర్వహించిన సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన రెబల్ స్టార్ అభిమానులకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు 50 రకాల వంటకాలు తయారు చేశారు దీనిలో 22 రకాలు నాన్ వెజ్ మిగిలినవి విజిటేరియన్ వంటకాలు అభిమానులు చుట్టుపక్కల ప్రజలు యొక్క క్షత్రియ ఫుడ్ ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలని ఏర్పాటు చేశారు.