Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ : అక్షరకు సపోర్ట్‌ చేసిన మిహికా బజాజ్..

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (22:55 IST)
బిగ్‌బాస్‌ షో ప్రస్తుతం తెలుగులో కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా విజయవంతంగా ప్రసారమవుతోంది. అటు తమిళంలోనూ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా ఐదో సీజన్‌ రన్‌ అవుతోంది. అక్టోబర్‌ 3న ప్రారంభమైన ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 
 
వీరిలో అక్షర రెడ్డి ఒకరు. ఈమె ఒక మోడల్‌, మిస్‌ గ్లోబ్‌ 2019 అవార్డు గ్రహీత. గతంలో 'విల్లా టు విలేజ్‌' అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. అలాగే 'కసు మెలా కసు' అనే మలేషియన్‌ మూవీలోనూ తొలిసారి నటించింది.
 
తాజాగా ఈ అక్షరకు సపోర్ట్‌గా నిలబడిందో టాలీవుడ్‌ హీరో భార్య. భళ్లాలదేవ రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్‌ అక్షరకు సపోర్ట్‌ చేయండంటూ వీడియో రిలీజ్‌ చేసింది. 'బిగ్‌బాస్‌ తమిళ ఐదో సీజన్‌లో పాల్గొన్న నా ప్రియ మిత్రురాలు అక్షరకు అభినందనలు. 
 
పాల్గొన్న నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్‌ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్‌ ద బెస్ట్‌' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments