Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్‌, రొమాన్స్ వున్న మైఖేల్ టీజర్ రాబోతుంది

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:19 IST)
Sandeep Kishan, Divyansha Kaushik
సందీప్ కిషన్  తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో ప్రత్యేక యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు సందీప్ కిషన్. సందీప్ కిషన్ సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ బాడీ  టెర్రిఫిక్ అనిపించింది.
 
ఈరోజు నిర్మాతలు ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. 'మైఖేల్’ టీజర్ అక్టోబర్ 20న విడుదల కానుంది. పోస్టర్‌లో సందీప్, దివ్యాంశ కౌశిక్ పెదవులపై ముద్దు పెట్టుకోవడం,  బ్యాక్ గ్రౌండ్ లో ఎగిరే పక్షులతో పోస్టర్ డిజైన్ చేయడం రొమాంటిక్ గా ఉంది. సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని ఈ పోస్టర్ తెలియజేస్తోంది.
 
ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సహా నిర్మాణంలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా గా సినిమాగా తెరకెక్కుతున్న మైఖేల్ చిత్రాన్ని నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్ స‌మ‌ర్పణ‌లో భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు నిర్మిస్తున్నారు.    
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments