గాడ్ ఫాదర్ జోరు.... సంక్రాంతికి వస్తానంటున్న వాల్తేరు వీరయ్య

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:09 IST)
మెగాస్టార్ చిరంజీవి మంచి జోరుమీదున్నారు. "గాడ్‌ఫాదర్‌"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రేక్షకులను ఖుషీ చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇదే ఊపుతో సంక్రాంతికి సిద్ధమవుతున్నారు. "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెఢీ అయ్యారు. ఇది చిరంజీవి నటించిన 154వ చిత్రం. హీరోయిన్‌గా శృతిహాసన్ నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. బాబీ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించే ఈ చిత్రంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాకథనాలతో నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో చిరంజీవి పక్కా ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన యాస, డైలాగ్ డెలివరీ, లుక్ విభిన్నంగా ఉండనున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. దీంతో ఇది సంక్రాంతికి విడుదల కాకపోవచ్చన్న సంకేతాలు వచ్చాయి. కానీ, ఇపుడు సంక్రాంతి బరిలోకి దిగనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. 
 
తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైపోయినట్టుగా మేకర్స్ అప్ డేట్ వదిలారు. సాధారణంగా చిత్రీకరణ ముగింపు దశకి చేరుకున్న తర్వాతనే డబ్బింగ్ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ఉంటారు. అందువలన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయమనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments