Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కిష‌న్ సిక్స్‌ప్యాక్‌తో మైఖేల్ ఫస్ట్ లుక్ - గౌతమ్ వాసుదేవ్ మీనన్ విల‌న్‌

Webdunia
శనివారం, 7 మే 2022 (12:56 IST)
Sandeep Kishan six pack
హీరో సందీప్ కిషన్ వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో తనదైన మార్క్ చాటుతున్నారు. అలాగే కథలో తన పాత్రకి తగ్గట్టు సరికొత్తగా తనని తానూ మలుచుకంటున్న సందీప్ కిషన్.. రంజిత్ జయ‌కొడి దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మైఖేల్‌' చిత్రంతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టారు.
 
సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా శ‌నివారంనాడు ‘మైఖేల్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ''గాడ్ ఓన్లీ ఫర్గివ్స్ ''అనే క్యాప్షన్ రిలిల్ చేసిన ఈ పోస్టర్ లో సందీప్ కిషన్  మునుప్పెన్నడు లేని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ దేహంతో ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధాలతో తన వద్దకు వస్తున్న క్రూరమైన వ్యక్తులుపై అంతే  క్రూరంగా సందీప్ కిషన్ గన్ తో గురిపెట్టడం ఈ పోస్టర్ గమనించవచ్చు. ఈ పోస్టర్ 'మైఖేల్ ' సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుందని వెల్లడిస్తుంది.
 
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సహా నిర్మాణంలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా గా సినిమాగా తెరకెక్కుతున్న మైఖేల్ చిత్రాన్ని నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్ స‌మ‌ర్పణ‌లో భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు నిర్మిస్తున్నారు.    
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రంజిత్ జయకొడి
నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: నారాయణ్ దాస్ కె నారంగ్
బ్యానర్లు: శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్షన్స్ ఎల్ఎల్‌పి
డీవోపీ: కిరణ్ కౌశిక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : శివచెర్రీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CBN Is Our Brand: చంద్రబాబు ఓ బ్రాండ్.. నారా లోకేష్ దావోస్ పర్యటన

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

పరందూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కావాల్సిందే.. కానీ రైతులకు అండగా ఉంటాం...

Pawan Kalyan : కాపు సామాజిక వర్గానికి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments