Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సంక్షోభంలో ఇంటికి కోడలు కానున్న మెహరీన్

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:59 IST)
కరోనా కష్టకాలంలో చాలా మంది సెలెబ్రిటీలు గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంటివారైపోతున్నాయి. ఇప్పటికే అనేక మంది పెళ్లి చేసుకుని హనీమూన్‌లకు కూడా వెళ్లివచ్చారు. గత యేడాది లాక్డౌన్ కాలంలో వివాహం చేసుకున్న సెలెబ్రిటీల్లో దగ్గుబాటి రానా, నిఖిల్‌, నితిన్‌.. ఇలా హీరోల జాబితానే ఎక్కువ ఉంది. 
 
అయితే ఈ యేడాది సంభవించిన కరోనా సంక్షోభ స‌మ‌యంలోనే అందాల తార మెహ‌రీన్ ఫిర్జాదా కూడా వివాహం చేసుకోనుంది. గ‌తేడాది లాక్డౌన్ స‌మయంలో ప‌రిచ‌య‌మైన భ‌వ్య బిష్ణోయ్‌ని త్వ‌ర‌లోనే మ‌నువాడ‌నుంది. భ‌వ్య బిష్ణోయ్.. హ‌ర్యానా మాజీ ముఖ్య మంత్రి భ‌జ‌న్‌లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు. 
 
ఈయన ప్ర‌స్తుతం కాంగ్రెస్ యువ నేత‌గా రాణిస్తున్నారు. ఇదిలావుంటే వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ స్నేహం ప్రేమ‌గా మారి పెద్ద‌లను ఒప్పించి పెళ్లి వ‌ర‌కు తీసుకొచ్చింది. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌నున్నారు. 
 
పెళ్లి ముహుర్తం త‌గ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌తో బిజీగా గ‌డుపుతోంది. తాజాగా మెహ‌రీన్ త‌న‌కు కాబోయే వాడితో క‌లిసి దిగిన ఓ అంద‌మైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. 
 
ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకుంటూ.. చేతులు ప‌ట్టుకున్న స‌మ‌యంలో తీసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ బంధాన్ని ఆ దేవుడు ఎప్పుడూ ఇలాగే ఆశీర్వ‌దీస్తాడ‌ని ఆశిస్తున్నాన‌ను’ అని అర్థం వ‌చ్చేలా క్యాప్ష‌న్ జోడించిందీ బ్యూటీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

ఢిల్లీ సీఎంపై దాడి ఘటనపై కేంద్రం సీరియస్ : జడ్ కేటగిరీ భద్రత

మద్యం కేసులో ఏపీ సర్కారు కీలక నిర్ణయం : రాజ్‌ కసిరెడ్డి ఆస్తుల జప్తు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments